యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ప్రధాని మోదీ చర్చలు
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోదీకి సమావేశమయ్యారు. విద్యుత్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, ఫిన్‌టెక్, రక్షణ, సంస్కృతి వంటి కీలక రంగాల్లో సహకారంపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఇదిలా ఉంటే, ప్రధాని మోదీ యూఏఈ పర్యటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్- యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం క్రమంగా బలపడుతోందని, వివిధ మార్గాల్లో ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మార్గాలను గుర్తించడానికి ప్రధాని మోదీ పర్యటన ఒక అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.