LOADING...
Attack on Oil Tanker: నల్లసముద్రంలో రష్యా చమురు ట్యాంకర్‌పై దాడి
నల్లసముద్రంలో రష్యా చమురు ట్యాంకర్‌పై దాడి

Attack on Oil Tanker: నల్లసముద్రంలో రష్యా చమురు ట్యాంకర్‌పై దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

నల్లసముద్రంలో (Black Sea) రష్యా చమురు తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్‌పై దాడి జరగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తుర్కియే రవాణా శాఖ మంత్రి అబ్దుల్‌ఖాదిర్ వెల్లడించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, తుర్కియే కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ నౌక విదేశీ జెండాతో ప్రయాణిస్తోంది. రష్యా నుంచి ముడి చమురు (Russian crude oil) తీసుకువస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై అత్యవసర కాల్ సెంటర్‌కు సమాచారం అందినట్లు మంత్రి చెప్పారు. నౌకలోని ఇంజిన్ రూమ్‌లో పేలుడు సంభవించిందని, దాడి కూడా ఆ భాగానికే లక్ష్యంగా జరిగిందని వెల్లడించారు.

వివరాలు 

బాస్ఫరస్ జలసంధికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఘటన

దాడి విధానం గురించి మాట్లాడిన మంత్రి, ఇది డ్రోన్ దాడి కావచ్చని అనిపించడం లేదని స్పష్టం చేశారు. సిబ్బంది లేకుండా నీటి ఉపరితలంపై ప్రయాణించే అన్‌మ్యాన్‌డ్ సర్ఫేస్ వెహికిల్ (Unmanned Surface Vehicle) ద్వారా ఈ దాడి జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వాహనాలను రిమోట్ ద్వారా నియంత్రిస్తారని తెలిపారు. బాస్ఫరస్ జలసంధికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాగా, దాడికి గురైన నౌకపై సియెర్రా లియోన్ దేశ జెండా ఎగురుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement