America: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్యురాలు మృతి
అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థుల మరణాలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, మరో విషాద ఘటన చోటుచేసుకుంది. తెనాలికి చెందిన జెట్టి హారిక (25) అనే వెటర్నరీ డాక్టర్ ఇటీవల అమెరికాలోని ఓక్లహోమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. హారిక గత ఏడాదిన్నర కాలంగా వెటర్నరీ మెడిసిన్‌లో ఉన్నత చదువులు చదువుతోంది. ఆమె తండ్రి జెట్టి శ్రీనివాసరావు, పన్ను శాఖ ఉద్యోగి. ఆమె తల్లి నాగమణి గృహిణి.తో ఆమె మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు. హారిక మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.