
Canada: ఎన్నికల ముందు ఉద్రిక్తత.. కెనడా పార్లమెంట్‌కు తాత్కాలిక తాళం
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా పార్లమెంట్ (Canada Parliament) భవనాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చిందని ఒట్టావా పోలీసులు ప్రకటించారు.
శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు పార్లమెంట్ హిల్‌లోని తూర్పు బ్లాక్‌లోకి అక్రమంగా ప్రవేశించడంతో ఈ చర్య తీసుకున్నారని తెలిపారు.
అతడు రాత్రంతా భవనం లోపలే ఉన్నాడని పేర్కొన్నారు. అయితే అతని వద్ద ఆయుధాలు ఉన్నాయా లేదా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదని వెల్లడించారు.
పార్లమెంట్ భవనంలోకి ఓ అనుమానాస్పద వ్యక్తి చొరబడిన సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలతోపాటు, భవనం చుట్టూ పోలీసు బలగాలను మోహరించారు. తూర్పు బ్లాక్‌లో ఉన్న సిబ్బందిని ఒకే గదిలోకి తరలించి తాళాలు వేసుకోవాలని సూచించారు.
Details
రహదారులు తాత్కలికంగా మూత
భవనంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించడంతోపాటు, పార్లమెంట్‌కు సమీపంలోని రహదారులను తాత్కాలికంగా మూసివేశారు.
ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకూడదని అధికారుల హెచ్చరికలతో ఆచితూచి చర్యలు కొనసాగించారు.
ఆదివారం ఉదయం దుండగుడిని అరెస్ట్ చేశామని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.
ఏప్రిల్ 28న జరగనున్న ముందస్తు ఎన్నికల నేపధ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ మార్చి 23న పార్లమెంటును రద్దు చేశారు.
అసలు తేదీ అయిన అక్టోబర్ 27ను వదిలి, ఎన్నికలను దాదాపు ఆరు నెలల ముందుగా జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనంలోకి దుండగుడు చొరబడిన ఘటన పలు అనుమానాలకు దారి తీస్తున్నదని అధికారులు పేర్కొన్నారు.