Loading...
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. ఢాకా విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్లు
బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. ఢాకా విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్లు

Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. ఢాకా విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2026
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ప్రధాని షేక్ హసీనా వచ్చే నెలలో స్వదేశానికి తిరిగి వెళ్లనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మరోసారి హింస చెలరేగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రెండు చోట్ల నాటు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు పాదచారులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ పేలుళ్లకు హసీనా స్వదేశానికి తిరిగి రావాలనే ప్రయత్నాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే విషయంపై స్పష్టత రాలేదు.

వివరాలు

హసీనా రాకపై రాజకీయ ఉద్రిక్తతలు

2024 ఆగస్టు నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా.. డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ విషయాన్ని ఆమె ప్రకటించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హసీనా మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

బ్యాంకులు, బస్సులకు నిప్పంటించడం సహా పలు హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి.

గత కొన్ని వారాల్లోనే 50 నాటు బాంబు పేలుళ్లు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

వివరాలు

ఢాకా, గోపాల్‌గంజ్‌లో భద్రత కట్టుదిట్టం

ఈ హింసాత్మక ఘటనలన్నింటికీ అవామీ లీగ్, ఆ పార్టీ అనుబంధ సంస్థలే కారణమని పోలీసులు ఆరోపిస్తున్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో ఢాకా పోలీసులు అప్రమత్తమయ్యారు. విధ్వంసక చర్యలను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

అవామీ లీగ్‌కు కంచుకోటలుగా భావించే ఢాకా, గోపాల్‌గంజ్‌తో పాటు ఇతర జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

డిసెంబర్ నెల మొత్తం అదనపు బలగాలను మోహరించాలని నిర్ణయించారు.

ADVERTISEMENT

వివరాలు

లండన్‌లోనూ హసీనా మద్దతుదారుల నిరసనలు

మరోవైపు తూర్పు లండన్‌లోని రామ్‌ఫోర్డ్‌లోనూ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

బంగ్లాదేశ్ ప్రవాసులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత నహీద్ ఇస్లాం పాల్గొన్నారు.

ప్రస్తుతం ఆయన నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. నహీద్ ఇస్లాం పర్యటనను వ్యతిరేకిస్తూ హసీనా మద్దతుదారులు సమావేశ ప్రాంగణం వెలుపల నిరసన చేపట్టారు.

అక్కడికి వచ్చిన అతిథులపై గుడ్లు, నీళ్ల బాటిళ్లు విసిరినట్లు సమాచారం. దీంతో ఇరు పక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలిసింది.

ADVERTISEMENT