Loading...
Terror Attack: సోమాలియాలో ఉగ్రదాడి.. 32 మంది మృతి
సోమాలియాలో ఉగ్రదాడి.. 32 మంది మృతి

Terror Attack: సోమాలియాలో ఉగ్రదాడి.. 32 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2024
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికా దేశం సోమాలియాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆ దేశ రాజధాని మొగడిషులోని లీడ్ బీచ్‌లోగాయ బాంబు దాడులకు పాల్పడటంతో 32 మంది మరణించారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఓ ఉగ్రవాది ఆత్మహుతి దాడికి పాల్పడిన తర్వాత మరో ఐదుగురు కాల్పులకు తెగబడటంతో ఇంతటి ప్రమాదం జరిగింది. భద్రతా దళాలు ముగ్గురు తీవ్రవాదులను కాల్చి చంపి, ఒకరిని ప్రాణాలతో పట్టుకున్నారు.

Details

దాడికి పాల్పడింది తామే : ఆల్ ఖైదా

ఎక్కువ మంది గుంపుగా ఉన్న చోట ఆత్మాహుతి దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

గతేడాది ఇదే బీచ్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో తొమ్మిది మంది చనిపోయిన విషయం తెలిసిందే.

కాగా ఈ దాడికి పాల్పడింది తామేనని ఆల్-ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ప్రకటన చేసింది.

ADVERTISEMENT