Sleep Walk: స్లీప్ వాక్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన బాలుడు.. ఏకంగా 160.కి.మీ నడక!
ఈ వార్తాకథనం ఏంటి
నిద్రలో సహజంగా నడిచే అలవాటు కొందరికి మాత్రమే ఉంటుంది. ఇంటి నుంచి కొంత దూరం వరకే కొంతమంది వెళ్లగలరు. అయితే ఓ బాలుడు ఏకంగా 160 కి.మీ నిద్రలో నడిచారు.
ఈ స్టోరీని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. అదే విధంగా ఆ బాలుడి పేరుతో రికార్డును కూడా క్రియేట్ చేసింది.
ఈ ఘటన 36 సంవత్సరాల క్రితం జరిగినట్లు స్పష్టం చేసింది. 1987 ఏప్రిల్ 6న 11 ఏళ్ల మైఖేల్ డిక్సన్ అనే బాలుడు అమెరికాలోని పెరూ, ఇండియానాలో రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతుండగా రైల్వే సిబ్బంది గుర్తించారు.
సూమారు 2.45 గంటల సమయంలో ట్రాక్ వెంబడి చెప్పులు లేకుండా, ఫైజామా ధరించిన బాలుడి వివరాలపై ఆరా తీశారు.
Details
స్లీప్ వాక్ సమస్యతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్న బాలుడు
ఇల్లినాయిన్ లోని డాన్ విల్లే నుండి మైఖేల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మైఖేల్ ఇంటికి సమీపంలోని స్టేషన్ నుంచి గూడ్స్ రైలు ఎక్కి అర్ధరాత్రి అంతదూరం ప్రయాణం చేశాడట.
అయితే తాను రైలు ఎక్కిన విషయం, దిగిన విషయం గుర్తు లేదని పోలీసులకు ఆ బాలుడు చెప్పాడట. నిద్రలో మైఖేల్ అంతదూరం ప్రయాణం చేసిన క్షేమం గా ఉండడం గమానార్హం.
మైకేల్ తల్లి ఆ బాలుడ్ని ఆ రోజు రాత్రి 10 గంటలకు చూసిందని, అయితే నిద్రలో అంతదూరం ప్రయాణించడంపై అశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు.
మొత్తానికి మైఖేల్ డిక్సన్ తనకున్న స్లీవ్ వాక్ సమస్యతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసిన స్టోరీ
Our 1989 edition of Guinness World Records featured the story of Michael Dixon, who managed to sleepwalk onto a freight train and end up 100 miles from home.https://t.co/vs1x9L4F7d
— Guinness World Records (@GWR) August 22, 2023