
FBI's 'most wanted:న్యూజెర్సీలో అదృశ్యమైన భారతదేశ యువతి.. $10,000 రివార్డ్ ప్రకటించిన FBI
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశానికి చెందిన 29 ఏళ్ల విద్యార్థిని నాలుగు సంవత్సరాల క్రితం న్యూజెర్సీ నుండి అదృశ్యమైంది.అదృశ్యమైన యువతీ పేరు మయూషి భగత్.
ఈ క్రమంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) కీలక ప్రకటన చేసింది. మయూషి భగత్ ఆచూకీ తెలిపిన వారికీ $10,000 వరకు రివార్డ్‌ను ఇస్తామని వెల్లడించింది.
మయూషి భగత్ చివరిసారిగా న్యూజెర్సీ సిటీలోని తన అపార్ట్‌మెంట్ నుండి ఏప్రిల్ 29, 2019 సాయంత్రం "రంగు రంగుల పైజామా ప్యాంటు, నల్లటి టీ-షర్టు" ధరించి బయటకు వెళ్లింది.
మే 1, 2019న ఆమె అదృశ్యమైనట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
FBI నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్,జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ భగత్ అదృశ్యాన్ని పరిష్కరించడంలో ప్రజల సహాయాన్ని కోరింది.
Details
"మిస్సింగ్ పర్సన్స్" జాబితాలో భగత్
గత ఏడాది జూలైలో, FBI భగత్‌ను "మిస్సింగ్ పర్సన్స్" జాబితాలో చేర్చింది.
అప్పటి నుంచి FBI నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్,జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ భగత్ అదృశ్యాన్ని పరిష్కరించడంలో ప్రజల సహాయాన్ని కోరుతోంది.
జూలై 1994లో భారతదేశంలో జన్మించిన భగత్ స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉండి న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతోంది.
ఆమె ఇంగ్లీష్, హిందీ,ఉర్దూ మాట్లాడుతుందని న్యూయార్క్ ఎఫ్‌బిఐ తెలిపింది.ఆమెకు న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లో స్నేహితులు ఉన్నారని సన్నిహితలు పోలీసులకు చెప్పారు.
ఆమె 2016లో F1 student visaపై అమెరికాకు వచ్చింది. FBI మోస్ట్ వాంటెడ్, కిడ్నాపింగ్ లిస్ట్‌లోనూ భగత్ పేరుని చేర్చింది .