
Russia: హాట్‌లైన్ మూగబోయింది.. రష్యా-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, రష్యా మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య హాట్‌లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయడం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.
రష్యా మీడియా సంస్థ టాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను తెలిపారు.
రష్యా-అమెరికా అధ్యక్షుల మధ్య వీడియో ప్రసారం చేయగల సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్నా, ప్రస్తుతం అది వినియోగంలో లేదని ఆయన స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతి ఇవ్వడంతో రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనికి ప్రతిగా రష్యా అణ్వాయుధ వినియోగ నిబంధనలను సులభతరం చేస్తూ వ్యూహాలను మార్చింది. .
Details
1963లో హాట్‌లైన్ వ్యవస్థ ప్రారంభం
ఈ క్రమంలో ఉక్రెయిన్ దళాలు రష్యా భూభాగంపై క్షిపణి దాడులు చేయడం, దీని ఫలితంగా రష్యా ప్రతీకార దాడులు చేసే అవకాశాలు ఉండటంతో పరిస్థితులు దిగజారుతున్నాయి.
1963లో క్యూబా మిసైల్ సంక్షోభం అనంతరం, అప్పటి అమెరికా-రష్యా నేతలు హాట్‌లైన్ వ్యవస్థను ప్రారంభించారు.
ఈ వ్యవస్థ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఇరు దేశాల నాయకులు నేరుగా కమ్యూనికేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
అయితే ఈ వ్యవస్థను అత్యవసరాలకే పరిమితం చేయాలనే నిబంధన ఉన్నా, తాజా ఉద్రిక్తతల సమయంలో అది వినియోగంలో లేకపోవడం గమనార్హం.
ఇలాంటి సమయంలో హాట్‌లైన్ వినియోగం లేకపోవడం, ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి అడ్డంకిగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు