ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్, అతని మద్దతుదారులపై నమోదైన కేసులు విచారణకు ఉన్నత స్థాయి సంయుక్త దర్యాప్తు బృందం(జేఐటీ)ను ఏర్పాటు చేసినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.
అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ పంజాబ్ జుల్ఫికర్ హమీద్ నేృతృత్వంలో ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ), డీఐజీ హెడ్‌క్వార్టర్స్ ఇస్లామాబాద్ అవైస్ అహ్మద్ కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అంతర్గత మంత్రి రాణా సనావుల్లా ప్రకటించారు.
తోషఖానాకు విదేశీ నిధులపై కోర్టు విచారణను అడ్డుకునేందుకు ఫిబ్రవరి 28న ఫెడరల్ జ్యుడీషియల్ కాంప్లెక్స్‌పై దాడి చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ సాయుధ ముఠాలను ఉపయోగించారని సనావుల్లా ఆరోపించారు.
ఇమ్రాన్ ఖాన్
విచారణ బృందానికి 14రోజుల గడువు
ఇమ్రాన్ ఖాన్‌పై ఉన్న కేసులను విచారించేందుకు జేఐటీ బృందానికి 14రోజుల సమయం ఇచ్చినట్లు సనావుల్లా వెల్లడించారు.
ప్రధానంగా తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు ఇటీవల జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లోకి అక్రమంగా ప్రవేశించి, ప్రధాన గేటును పగలగొట్టి, కోర్టును ధ్వంసం చేశారని యన ఆరోపించారు.
ఇస్లామాబాద్‌లోని రామ్నా పోలీస్ స్టేషన్‌లో, ఉగ్రవాద నిరోధక చట్టం (ఏటీఏ) సెక్షన్ 7, అదనపు నేరాల కింద ఈ విషయంలో కేసు నమోదు చేశారు. తీవ్రవాద సంబంధిత ఆరోపణల కింద ప్రత్యేక ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.
జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో హింస, విధ్వంసం సమయంలో 58 మంది పోలీసు అధికారులు గాయపడినట్లు, 12 కార్లు, 20 మోటార్ సైకిళ్లు, ఒక పోలీసు చౌకీ (చెక్‌పోస్ట్) నిప్పంటించారని పోలీసులు తెలిపారు.