Page Loader
Donald Trump:వేరే ఆప్షన్ లేదు.. 90 వేల మందిని పంపిస్తామని ట్రంప్ ప్రకటన 
వేరే ఆప్షన్ లేదు.. 90 వేల మందిని పంపిస్తామని ట్రంప్ ప్రకటన

Donald Trump:వేరే ఆప్షన్ లేదు.. 90 వేల మందిని పంపిస్తామని ట్రంప్ ప్రకటన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2025
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

డొనాల్డ్ ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ వ్యయాలు తగ్గించే చర్యలను ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌లో కొత్తగా చేరిన 90,000 మంది ఏజెంట్లను సరిహద్దులకు పంపించనున్నట్లు ప్రకటించారు. లాస్‌ వేగాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, 'వారిలో 88,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం లేదా నియమించామన్నారు. ఇప్పుడు వారిని తొలగించడం లేదా సరిహద్దులకు పంపించడానికి తాము ప్లాన్ చేస్తున్నామన్నారు. వారికి తుపాకులు ఇచ్చి బోర్డర్స్‌కు పంపడం సరైన నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు.

Details

ప్రజారక్షణ విభాగాలకు మాత్రం మినహాయింపు

ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టిన కొద్దిసేపటికే ఫెడరల్‌ ఉద్యోగుల నియామకాలను 90 రోజుల పాటు స్తంభింపజేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ భద్రత, ప్రజారక్షణ విభాగాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. కానీ ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ విభాగం మాత్రం ట్రంప్‌ కార్యవర్గం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ ఆదేశాలు జారీ చేయనంతవరకు ఆపివేయాల్సిందే. ఇక ట్రంప్‌ సరికొత్త ఎక్స్‌టర్నల్‌ రెవెన్యూ ఆఫీస్‌ను ప్రారంభిస్తూ విదేశాల నుంచి వచ్చే ఆదాయాలను వసూలు చేయడానికి కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు.

Details

మెక్సికో వంటి దేశాలపై భారీ టారీఫ్‌

ఈ కార్యాలయం కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీ టారీఫ్‌ విధించనుంది. వీటిని కూడా అదే కార్యాలయం చూసుకుంటుంది. అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్‌ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేస్తూ ట్రంప్‌ ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ ఆదేశాల ప్రకారం డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ (డీఈఐ) విభాగాలకు చెందిన అన్ని సిబ్బందిని బుధవారం సాయంత్రం 5 గంటలలోగా వేతనంతో కూడిన సెలవుపై పంపించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ విభాగాలకు సంబంధించిన అన్ని వెబ్‌ పేజీలను కూడా తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, డీఈఐ శిక్షణను తక్షణమే ముగించాలని ఆదేశించారు.