Loading...
Forbes Billionaires List 2026: ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎక్కడంటే?
ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎక్కడంటే?

Forbes Billionaires List 2026: ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎక్కడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారు? వారి మొత్తం సంపద ఎంత? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా '2026 బిలియనీర్ల జాబితా'ను విడుదల చేసింది. ఈసారి 80 దేశాలకు చెందిన మొత్తం 3,428 మంది బిలియనీర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకుని కొత్త రికార్డు సృష్టించారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లలో 51 శాతం మంది కేవలం మూడు దేశాల్లోనే కేంద్రీకృతమై ఉండటం.

వివరాలు 

అమెరికాదే అగ్రస్థానం

అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో అమెరికా మరోసారి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది.

మొత్తం 989 మంది బిలియనీర్లు అమెరికాలో ఉండగా, వారి కలిపిన సంపద విలువ 8.4 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది.

ప్రపంచ టాప్-20 కుబేరుల్లో 15 మంది అమెరికాకు చెందినవారే కావడం గమనార్హం.

అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ కూడా అమెరికాకే చెందినవారు.

ఆయన సంపద 839 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఈ ఏడాది కొత్తగా 106 మంది అమెరికా నుంచి ఈ జాబితాలోకి చేరారు. వారిలో డాక్టర్ డ్రే, బియోన్సే, టేలర్ స్విఫ్ట్ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి.

వివరాలు 

చైనాకు రెండో స్థానం.. ఏఐతో అదుర్స్

539 మంది బిలియనీర్లతో చైనా ఈ జాబితాలో రెండో స్థానాన్ని సంపాదించింది.

వారి మొత్తం సంపద 2.2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది చైనాలో బిలియనీర్ల సంఖ్య 495 ఉండగా, ఈసారి అది గణనీయంగా పెరిగింది.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కన్స్యూమర్ గూడ్స్ రంగాల్లో నమోదైన వృద్ధి ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.

చైనాలో అత్యంత ధనవంతుడిగా బైట్‌డాన్స్ సహ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ నిలిచారు. ఆయన సంపద 69.3 బిలియన్ డాలర్లు.

ADVERTISEMENT

వివరాలు 

మూడో స్థానంలో భారత్

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్ ఈసారి బిలియనీర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

దేశంలో మొత్తం 229 మంది బిలియనీర్లు ఉండగా, వారి సంపద మొత్తం 1 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

గతేడాది ఈ మొత్తం 941 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత్‌లో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కొనసాగుతున్నారు.

ఆయన సంపద 99.7 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

ఇతర దేశాల పరిస్థితి ఇలా..

ఈ జాబితాలో జర్మనీ 212 మంది బిలియనీర్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

రష్యా 147 మంది కుబేరులతో ఐదో స్థానంలో ఉంది. గత ఏడాది టాప్-10లో ఉన్న బ్రిటన్, ఈసారి 12వ స్థానానికి పడిపోయింది.

మరోవైపు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం బలంతో తైవాన్ టాప్-10లో 10వ స్థానానికి చేరుకుంది.

ఇక ఆసక్తికర విషయాలు కూడా ఈ జాబితాలో కనిపించాయి. ఏఐ కోడింగ్ టూల్ 'కర్సర్' వ్యవస్థాపకుడు సులేహ్ ఆసిఫ్ 1.3 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో చోటు దక్కించుకోవడంతో,పాకిస్థాన్ 2010 తర్వాత మళ్లీ ఫోర్బ్స్ బిలియనీర్ల లిస్ట్‌లోకి వచ్చింది.

అలాగే,దుబాయ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ మీర్వాయిస్ అజీజీ 1.4బిలియన్ డాలర్ల సంపదతో నిలవడంతో,ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ జాబితాలో తన ఖాతా తెరిచింది.

వివరాలు 

అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్-10 దేశాలు (మార్చి 1, 2026 నాటికి)

అమెరికా (USA): 989 మంది (8.4 ట్రిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: ఎలాన్ మస్క్ (839 బిలియన్ డాలర్లు)

చైనా (China): 539 మంది (2.2 ట్రిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: ఝాంగ్ యిమింగ్ (69.3 బిలియన్ డాలర్లు)

భారత్ (India): 229 మంది (1 ట్రిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: ముకేశ్ అంబానీ (99.7 బిలియన్ డాలర్లు)

జర్మనీ (Germany): 212 మంది (1 ట్రిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: డైటర్ స్క్వార్జ్ (67.2 బిలియన్ డాలర్లు)

రష్యా (Russia): 147 మంది (649 బిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: అలెక్సీ మోర్దాషోవ్ అండ్ ఫ్యామిలీ (37 బిలియన్ డాలర్లు)

వివరాలు 

అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్-10 దేశాలు (మార్చి 1, 2026 నాటికి)

ఇటలీ (Italy): 89 మంది (483 బిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: జియాంకార్లో దేవాసిని (89.3 బిలియన్ డాలర్లు)

కెనడా (Canada): 82 మంది (457 బిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: చాంగ్‌పెంగ్ జావో (110 బిలియన్ డాలర్లు)

హాంకాంగ్ (Hong Kong): 71 మంది (420 బిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: రాబిన్ జెంగ్ (53.2 బిలియన్ డాలర్లు)

బ్రెజిల్ (Brazil): 70 మంది (265 బిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: ఎడ్వర్డో సావెరిన్ (35.9 బిలియన్ డాలర్లు)

తైవాన్ (Taiwan): 66 మంది (245 బిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: టెర్రీ గౌ (15.3 బిలియన్ డాలర్లు)

ADVERTISEMENT