
Tim Cook: ట్రంప్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఆపిల్ సీఈఓ: వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ బుధవారం రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ అందించారు. ఈ బహుమతి ఒక ప్రత్యేకమైన గ్లాస్ ముక్క, అది ఐఫోన్ గ్లాస్ తయారు చేసే ప్రముఖ కంపెనీ 'కార్నింగ్' తయారు చేసింది. దీన్ని 24 క్యారెట్ల బంగారు ఆధారంలో అమర్చారు. ఈ సందర్భంలో ఆపిల్ తన పెట్టుబడులను మరింతగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే అమెరికాలో $500 బిలియన్ (దాదాపు రూ. 41 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టిన ఆపిల్, తాజాగా మరో $100 బిలియన్ పెట్టుబడికి రెడీ అవుతున్నట్టు వెల్లడించింది. దీంతో మొత్తం పెట్టుబడి రూ. 50 లక్షల కోట్లు (మొత్తం $600 బిలియన్)కి చేరింది.
వివరాలు
ఈ డిజైన్‌ను ఒక మాజీ యుఎస్ మెరైన్ కార్ప్స్ కార్పోరల్ రూపొందించారు
వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్‌లో ట్రంప్,వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్‌తో కలిసి టిమ్ కుక్,ఆ ప్రత్యేకమైన గిఫ్ట్‌ను ప్రదర్శించారు. ఆ గ్లాస్ ముక్కపై ఆపిల్ లోగో ఉండగా,దాని మీద ట్రంప్ పేరును ముద్రించారు. దిగువన టిమ్ కుక్ సంతకం,"Made in USA" అనే మెసేజ్,2025 సంవత్సరం కూడా ఉంది. ఈ డిజైన్‌ను ఒక మాజీ యుఎస్ మెరైన్ కార్ప్స్ కార్పోరల్ రూపొందించాడని టిమ్ కుక్ తెలిపారు. అతను ప్రస్తుతం ఆపిల్‌లో పని చేస్తున్నాడు. ఈ బంగారు బేస్ యుటా రాష్ట్రంలో తయారైందని చెప్పారు. "ఇది కార్నింగ్ తయారు చేసిన గ్లాస్. ట్రంప్ పేరుతో ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.ఇది ఒకే ఒక్క మోడల్. బేస్ మాత్రం 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు"అని వివరించారు.
వివరాలు
మొత్తం పెట్టుబడి $600 బిలియన్‌కి..
ప్రస్తుతం బంగారం ధర ఔన్స్‌కు $3,300 దాటినట్లు రాయిటర్స్ తెలిపింది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే.. అమెరికాలోనే ఐఫోన్‌ల తయారీ కావాలని ట్రంప్ కోరిన విషయం తెలిసిందే.ఇప్పటికైనా యాపిల్ చేపట్టిన ఈ పెట్టుబడి కీలక అడుగుగా ట్రంప్ పేర్కొన్నారు. "అలాంటి కంపెనీలు ఇప్పుడు తిరిగి అమెరికాలో పెట్టుబడులకు వస్తున్నాయి.ఇది మొదటి అడుగు మాత్రమే.త్వరలో అమెరికాలో తయారైన ఐఫోన్‌లను మన మార్కెట్‌లో చూడబోతున్నాం"అని ట్రంప్ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే యాపిల్ దేశవ్యాప్తంగా 20,000 మందిని నియమిస్తూ,$500 బిలియన్ పెట్టుబడి పెడతామని ప్రకటించింది. ఇప్పుడు అదనంగా మరో $100 బిలియన్ పెట్టి,మొత్తం పెట్టుబడిని $600 బిలియన్‌కి తీసుకెళ్లింది. ఇది టెక్ రంగంలోనే కాదు, అమెరికన్ ఉద్యోగావకాశాల పరంగా కూడా ఒక పెద్ద మైలురాయి అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రంప్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఆపిల్ సీఈఓ..
Tim Cook: It is engraved for President Trump. It is a unique unit of one. And the base comes from Utah, and is 24 karat gold. pic.twitter.com/tr6icHshJU
— Acyn (@Acyn) August 6, 2025