Page Loader
Israel Iran war: ఇరాన్‌పై రాకెట్ దాడులకు బాధ్యత వహించిన టాప్ హిజ్బుల్లా కమాండర్‌ హతం.. 
ఇరాన్‌పై రాకెట్ దాడులకు బాధ్యత వహించిన టాప్ హిజ్బుల్లా కమాండర్‌ హతం..

Israel Iran war: ఇరాన్‌పై రాకెట్ దాడులకు బాధ్యత వహించిన టాప్ హిజ్బుల్లా కమాండర్‌ హతం.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2024
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులతో హిజ్బుల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోసారి ఆ సంస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది టెల్ అవీవ్. టెల్ అవీవ్ బలగాలు చేపట్టిన ఈ దాడుల్లో హెజ్‌బొల్లా టాప్ కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్ దక్షిణ లెబనాన్‌లో హతమయ్యారని ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) వెల్లడించింది. IDF ప్రకారం, జాఫర్ ఖాదర్ ఫార్ నాయకత్వంలోని నాసర్ బ్రిగేడ్ రాకెట్ మిస్సైల్స్ యూనిట్ ఇటీవల ఇజ్రాయెల్‌పై పలు రాకెట్ దాడులకు పాల్పడిందని ఆరోపిస్తోంది.

వివరాలు 

ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు - అనుమానిత నేతగా జాఫర్ 

నాసర్ బ్రిగేడ్ రాకెట్ యూనిట్ దాడుల్లో జాఫర్ ప్రధానంగా ఉన్నాడని IDF అనుమానించింది. ఇటీవలి మాజ్ దల్ షామ్స్ రాకెట్ దాడుల్లో 12 మంది చిన్నారులు మృతి చెందారు, 30 మందికి పైగా గాయపడ్డారు. మెటులాలో జరిగిన ఘనంలో ఐదుగురు ఇజ్రాయెలీలు చనిపోవడం వెనుక కూడా జాఫర్ హస్తం ఉన్నట్లు IDF తెలిపింది. గతేడాది అక్టోబర్ 8న తూర్పు లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌పై జరిగిన రాకెట్ దాడుల్లో జాఫర్ ఖాదర్ ఫార్ ప్రధాన పాత్ర పోషించాడని IDF పేర్కొంది. ఈ దాడులకు ముందు తూర్పు లెబనాన్‌లో ఒక సీనియర్ హెజ్‌బొల్లా ఆపరేటివ్‌ను ఇజ్రాయెల్ నేవీ అదుపులోకి తీసుకుందని వెల్లడించింది. అయితే, ఆ ఆపరేటివ్ ఎవరో ఇంకా వెల్లడించలేదు.