LOADING...
Mark Carney: 'పరివర్తన చెందిన అధ్యక్షుడు': భారతదేశం-పాక్ శాంతిపై ట్రంప్‌ను ప్రశంసించిన కెనడా ప్రధాని
భారతదేశం-పాక్ శాంతిపై ట్రంప్‌ను ప్రశంసించిన కెనడా ప్రధాని

Mark Carney: 'పరివర్తన చెందిన అధ్యక్షుడు': భారతదేశం-పాక్ శాంతిపై ట్రంప్‌ను ప్రశంసించిన కెనడా ప్రధాని

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కెనడా ప్రధాని మార్క్ కార్నీ అనూహ్యంగా ప్రశంసల వర్షం కురిపించారు. ట్రంప్ ఒక పరివర్తనాత్మక అధ్యక్షుడు కాగా,భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి స్థాపనలో అతనికి ముఖ్య పాత్ర ఉందని అభిప్రాయపడ్డారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా కార్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవల్ ఆఫీసులోని సమావేశంలో కార్నీ మాట్లాడుతూ,కొన్ని నెలల క్రితం ట్రంప్ తనను,సహచరులను ఆహ్వానించినప్పుడు"మీరు ఒక పరివర్తనాత్మక నాయకుడు" అని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ సమయంలోనుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు వచ్చాయని,NATO భాగస్వామ్య దేశాలు రక్షణ వ్యయాన్ని పెంచటం, భారత్-పాకిస్థాన్,అజర్‌బైజాన్-అర్మేనియా వంటి ప్రాంతాల్లో శాంతి స్థాపన,ఇరాన్‌ను ఉగ్రవాద శక్తిగా నిర్వీర్యం చేయడం వంటి కీలక చర్యలు జరిగాయని ఆయన అన్నారు.

వివరాలు 

ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనను గతంలోనే ఖండించిన భారత్ 

ఇటీవల ట్రంప్ పలు సార్లు భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఉద్రిక్తతల సమయంలో తన మధ్యవర్తిత్వం ద్వారా శాంతిని నెలకొల్పానని ప్రకటించారు. అయితే, ఈ వాదనను భారత ప్రభుత్వం మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. ట్రంప్ విధించిన టారిఫ్‌లు, కెనడాను అమెరికాలో విలీనం చేయాలంటూ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మార్చిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, కార్నీ వైట్‌హౌస్‌ను రెండోసారి సందర్శించడం, ట్రంప్‌ను ప్రశంసించడం, ఒట్టావా-వాషింగ్టన్ సంబంధాల్లో ఒక కొత్త దిశకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో ట్రంప్ సరదాగా కెనడాను అమెరికాలో విలీనం చేయాలని ప్రస్తావించినప్పుడు, కార్నీ నవ్వుతూ ఆ అంశాన్ని పక్కనపెట్టారు.

వివరాలు 

గత కొన్ని నెలలుగా కెనడాతో సంబంధాలు మెరుగుపడ్డాయి : ట్రంప్ 

సభలో స్నేహపూర్వక వాతావరణం కనిపించినప్పటికీ, కలప, అల్యూమినియం, స్టీల్ వంటి ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్‌లను రద్దు చేయడంలో ఎటువంటి స్పష్టమైన ఒప్పందం వెలువడలేదు. కార్నీ, కెనడాకు సరైన ఒప్పందం లభిస్తుందని ఆశభావంవ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా సంబంధాలు మెరుగుపడ్డాయని ట్రంప్ గుర్తుచేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రంప్‌ను పరివర్తనాత్మక అధ్యక్షుడిగా అభివర్ణించిన కార్నీ