Page Loader
US-India: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్'లో భారత్‌కు తొలి ప్రాధాన్యం.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తో మొదటి సమావేశం 
జైశంకర్‌ తో అమెరికా నూతన విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ

US-India: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్'లో భారత్‌కు తొలి ప్రాధాన్యం.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తో మొదటి సమావేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) తన రెండో హయాంలో భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ (S. Jaishankar)తో చర్చలు నిర్వహించారు. న్యూఢిల్లీకి ప్రాముఖ్యతనిస్తూ వాషింగ్టన్‌ ఈ సమావేశాన్ని నిర్వహించింది. రూబియోతో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌తో కూడా జైశంకర్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మార్కో రూబియోతో భేటీ గురించి ట్వీట్ చేసిన జైశంకర్