Trump Traiffs: రష్యాతో వ్యాపారం చేసే దేశాలకు ట్రంప్ భారీ షాక్.. 500% సుంకాల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోవడంతో, రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సుంకాల పెంపునకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు తానూ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. మాస్కోతో వ్యాపారం చేసే దేశాలపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే రష్యాతో వ్యాపారం చేసే దేశాలకు 500 శాతం టారిఫ్‌లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
వివరాలు
భారత్‌పై 50 శాతం సుంకాలు
ఈ జాబితాలో భారత్, చైనా కూడా ఉన్నట్లు సమాచారం. అదనంగా, ఇరాన్‌ను కూడా ఈ వర్గంలోకి చేర్చనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. భారత్, చైనా రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటూ మాస్కోకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నాయన్న కారణంతోనే రష్యా కీవ్‌పై దాడులు కొనసాగిస్తున్నదని గతంలో ట్రంప్ విమర్శించారు. ఇదే నేపథ్యంలో భారత్‌పై 50 శాతం సుంకాలు ఇప్పటికే విధించారు. ఇప్పుడు కొత్త సుంకాల పెంపు బిల్లుకు ట్రంప్ ఆమోదం లభిస్తే, రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై పెద్ద స్థాయిలో ప్రభావం పడే అవకాశం ఉంది.