'Donald Trump: 'యుద్ధాన్ని నేనే ఆపించాను'… ట్రంప్ మరోసారి పాత కథ రిపీట్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్ దాడి అనంతరం భారత్ "ఆపరేషన్ సిందూర్" పేరుతో పాకిస్థాన్‌పై భారీ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో పాకిస్తాన్ సహా పీఓకే ప్రాంతంలోని అనేక ఉగ్రశిబిరాలను లక్ష్యంగా చేసుకుని, అక్కడి వందలాది ఉగ్రవాదులను నిష్క్రమణకు గురిచేసింది. పాకిస్తాన్ సైన్యం కవ్వించే చర్యలకు దిగిన నేపథ్యంలో, భారత్ పాక్ వైమానిక దళానికి చెందిన పదికి పైగా ఎయిర్‌బేస్‌లను నేలమట్టం చేసింది. అయితే, ఈ సంఘటనల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక సార్లు ''ఈ యుద్ధం నేను ఆపించాను'' అంటూ వ్యాఖ్యానించడం ప్రారంభించాడు. వాణిజ్యాన్ని చూపించి యుద్ధాన్ని నివారించినట్లు చెప్పుకున్నారు. ఈ సంఘర్షణలో కొన్ని విమానాలు కూలినట్లు చెప్పాడు.
వివరాలు
ప్రధాని మోడీ ఫోన్ చేశారు
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత్ సూటిగా కొట్టిపారేసింది.కాల్పుల విరమణలో ఏ దేశ ప్రమేయం లేదని భారత ప్రభుత్వ ప్రతిపాదన స్పష్టంగా తెలిపింది. అయినా కూడా ట్రంప్ మళ్లీ అదే విషయం పునరావృతం చేస్తూనే ఉన్నాడు. భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తనంతట తాను 350 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించడంతో సమస్య పరిష్కారమైందని అతని వాదన. అంతేకాక,ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి ''మేము యుద్ధానికి వెళ్లే ఉద్దేశ్యం లేదు'' అని చెప్పారని కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. భారత ప్రభుత్వం ఎంతసార్లు ''పాకిస్తానే కాల్పుల విరమణ కోరింది,మూడో పక్షం పాత్రే లేదు''అని స్పష్టం చేసినా..ట్రంప్ మాత్రం ఇదే కథను ఇప్పటివరకు దాదాపు 60 సార్లు రిపీట్ చేశారు .
వివరాలు
ఎనిమిదికి పైగా యుద్ధాల్ని ఆపేశా: ట్రంప్
US-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో మాట్లాడుతూ ట్రంప్ మరిన్ని వ్యాఖ్యలు చేశాడు. ''భారత్, పాకిస్తాన్‌లు యుద్ధం కొనసాగిస్తే రెండు దేశాలపైనా 350 శాతం సుంకాలు పెడతానని హెచ్చరించాను. ఆ పరిస్థితిలో అమెరికాతో వాణిజ్యం ఒక్క దానికి కూడా అందుబాటులో ఉండదు అని చెప్పా. అప్పుడు రెండు దేశాలు కూడా వెనక్కు తగ్గాయి'' అని వివరించాడు. ఇంతటి చర్యలను మరో అమెరికా అధ్యక్షుడు ఎవరూ చేయలేదని, తాను ఎనిమిదికి పైగా యుద్ధాల్ని ఆపేశానని అతను గర్వంగా చెప్పుకొచ్చాడు.