
Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాల మధ్య జరిగిన సమావేశం తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది.
ఈ భేటీలో ట్రంప్ కీలక ఆరోపణలు చేశారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులపై లక్ష్యంగా మారణహోమం జరుగుతోందని ఆయన అన్నారు.
జాత్యహంకారానికి సంబంధించిన చట్టాలు, దేశంలో ఉన్న మౌలిక సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ ఆరోపణలపై వెంటనే స్పందించిన రామఫోసా, ట్రంప్ వాదనలను తప్పుబట్టారు.
ఆయన స్పష్టం చేస్తూ, శ్వేతజాతీయులపై కాకుండా, దక్షిణాఫ్రికాలో అత్యధికంగా బాధితులు నల్లజాతీయులేనని పేర్కొన్నారు.
వివరాలు
వీడియోలు, ప్రత్యక్ష నిదర్శనాలతో ట్రంప్ ఆరోపణలు
ట్రంప్ తన ఆరోపణలను సమర్థించేందుకు కొన్ని వీడియోలు,కథనాలను చూపించారు.
వాటిలో దక్షిణాఫ్రికాలోని కొంతమంది రైతులపై జరిగిన దాడులను చూపించారు.
ఇది శ్వేతజాతీయులపై జరుగుతున్న అణచివేతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ దృశ్యాలను ఆధారంగా చూపించి, ఆ దేశంలో శ్వేతజాతీయులపై హింస జరుగుతోందని నిలదీశారు.
అయితే, ఈ దశలోనే అధ్యక్షుడు రామఫోసా తక్షణంగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు.
ఆ వీడియోలను ఇప్పటివరకు తాము చూడలేదని పేర్కొన్నారు. అదేవిధంగా, సౌతాఫ్రికాలో శ్వేతజాతీయులపై ఎలాంటి వ్యవస్థపరమైన హింస జరుగలేదని ఘాటుగా సమాధానమిచ్చారు.
ట్రంప్ ప్రస్తావించిన అంశాల వెనుక ఏముందో తాము పరిశీలిస్తామని రామఫోసా స్పష్టం చేశారు.
వివరాలు
వరుసగా రెండు సార్లు అవమానం..
వైట్‌హౌస్ లోని ఓవల్ ఆఫీస్ వేదికగా ట్రంప్‌కు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో అవమానం ఎదురైంది.
ఇది ఇటీవలిలో జరిగిన రెండో సంఘటన.అంతకముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ ట్రంప్ తో జరిగిన సమావేశం మధ్యలోనే తీవ్రంగా స్పందించి, అరుస్తూ భేటీని నుండి వెళ్లిపోయారు.
ఇప్పుడు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసాతో జరిగిన సమావేశం కూడా రసాభాసగా ముగిసింది.
సమావేశంలో ఇద్దరు అధ్యక్షులూ గట్టిగానే వాదనలు కొనసాగించారు. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కూడా ట్రంప్ ఆ కోపాన్ని చూపించారు.
ట్రంప్ తన ఆగ్రహాన్ని అక్కడ ప్రదర్శిస్తూ,ప్రెస్ రిపోర్ట్ ను సూటిగా "గెట్ అవుట్"అంటూ తిప్పికొట్టారు.
ఈ పరిణామాల నేపథ్యంలో,పరిస్థితిని శాంతిగా చేయాల్సిన బాధ్యత రామఫోసాపైనే పడింది. ఆయన, వాతావరణాన్ని సర్దుబాటు చేస్తూ సమావేశాన్ని ముగించారు.