తదుపరి వార్తా కథనం
Trump: హుష్ మనీ కేసును కొట్టేయాలని ట్రంప్ పిటిషన్
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 04, 2024
08:51 am
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తనపై ఉన్న క్రిమినల్ కేసుల్లో వరుసగా ఊరట పొందుతున్నారు.
2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడంపై విచారణను కోర్టు పక్కనపెట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో, శృంగార తార స్టార్మీ డేనియల్స్ వేసిన హష్ మనీ కేసుపై ట్రంప్ తాజాగా తన దృష్టిని సారించారు.
వివరాలు
కేసు తన అధ్యక్ష పదవి నిర్వహణకు అడ్డంగా మారుతోంది: ట్రంప్
ఈ కేసును కొట్టివేయాలంటూ న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు.
ఈ కేసు తన అధ్యక్ష పదవి నిర్వహణకు అడ్డంగా మారుతోందని ట్రంప్ తన పిటిషన్‌లో తెలిపారు.
అసలు, నవంబర్ 26న ఈ కేసులో ట్రంప్‌కు శిక్ష ఖరారు చేయాల్సి ఉండేది. కానీ, జడ్జి శిక్ష ఖరారు ప్రక్రియను నిరవధికంగా వాయిదా వేశారు.
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన వ్యక్తులకు క్రిమినల్ కేసుల నుంచి రక్షణ కల్పించే నిబంధన ట్రంప్‌కు ప్రస్తుతం ప్రయోజనకరంగా మారింది.