Page Loader
US election: ఆరు రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యం.. ఒపీనియన్‌ పోల్‌లో బైడెన్‌ వెనకంజ! 
ఆరు రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యం.. ఒపీనియన్‌ పోల్‌లో బైడెన్‌ వెనకంజ!

US election: ఆరు రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యం.. ఒపీనియన్‌ పోల్‌లో బైడెన్‌ వెనకంజ! 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2024
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇదిలా ఉండగా ఓ కీలక ఒపీనియన్‌ పోల్‌ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఏడు రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల్లో బైడెన్ తన ప్రధాన ప్రత్యర్థి ట్రంప్ కంటే వెనుకబడి ఉన్నారని వెల్లడించింది. ఓటర్లు బైడెన్‌ పనితీరుపై కొన్ని అంశాల్లో అసంతృప్తితో ఉన్నారు. బైడెన్ సామర్థ్యం, ఉపాధి కల్పన దేశ ఆర్థిక వ్యవస్థపై లోతైన సందేహాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. పెన్సిల్వేనియా, మిచిగాన్, అరిజోనా, జార్జియా, నెవాడా, నార్త్ కరోలినాలో రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌నకు ఆరు నుంచి ఎనిమిది పర్సంటేజీ పాయింట్ల ఆధిక్యం లభించినట్లు తెలిపింది.

Details 

బైడెన్‌, ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోటీ 

అయితే, ఒక్క విస్కాన్సిన్‌లో బైడెన్ ట్రంప్‌ కంటే మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నారు. సర్వే జరిపిన అన్ని రాష్ట్రలలో, బైడెన్‌ పనితీరుపై సానుకూల అభిప్రాయాల కంటే ప్రతికూల అభిప్రాయాలు ఉన్నవారే ఎక్కువగా ఉండడం గమనార్హం. అదే ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పనితీరు బాగుందని ఆరు రాష్ట్రాల్లోని ఓటర్లు అభిప్రాయపడగా, ఒక్క అరిజోనాలో మాత్రమే ఆయనకు నెగెటివ్‌ మార్కులు వచ్చాయని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అన్ని ప్రధాన జాతీయ పోల్స్‌ను ట్రాక్ చేసే రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకారం, ట్రంప్, బైడెన్ నెక్ టు నెక్ ఫైట్‌లో ఉన్నారు. ప్రధాన జాతీయ సర్వేల సగటు ప్రకారం ట్రంప్, బైడెన్ కంటే 0.8 శాతం పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నారు.