
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. సన్‌బాత్ చేస్తుండగానే డ్రోన్ దాడి చేస్తాం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఆయన ఫ్లోరిడాలో నివసించే మార్-ఎ-లాగో రిసార్ట్ ప్రాంతం సురక్షితం కాదని పేర్కొంది ఇరాన్ అధికాధికారుల్లో ఒకరైన జావద్ లారిజాని వెల్లడించిన వివరాల ప్రకారం, ట్రంప్ సన్‌బాత్ చేస్తున్న సమయంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేస్తామని తెలిపారు. ఇటీవల అమెరికా,ఇరాన్ అణు కేంద్రములపై దాడులు జరిపిన నేపథ్యంలో ఈ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యమే ఇరాన్ తరఫున ఇటువంటి హెచ్చరికలు రావడానికి కారణమని భావిస్తున్నారు. ట్రంప్ పై ఇరాన్‌కు ఉన్న ఆగ్రహానికి ప్రధానంగా 2020లో అమెరికా చేపట్టిన చర్య.. జనరల్ ఖాసిం సులేమానీ హత్యను చూపిస్తున్నారు. ఈహత్యకు ట్రంప్ జవాబుదారీనని ఇరాన్ పదే పదే పేర్కొంటోంది.
వివరాలు
బ్లడ్ పాక్ట్ అనే పేరుతో క్రౌడ్‌ఫండింగ్ వేదిక
ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీకి సలహాదారుగా వ్యవహరిస్తున్న జావద్ లారిజాని మాట్లాడుతూ.. ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో సన్‌బాత్ చేస్తున్నప్పుడు ఒక చిన్న డ్రోన్‌తో దాడి చేయడం ఎంతగానో సాధ్యమేనని అన్నారు. అది చాలా చిన్న పని అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ స్థానిక మీడియాలో ప్రసారం కావడం గమనార్హం. ఇక ట్రంప్‌పై బౌంటీ (ప్రతిఫలం)ప్రకటించేందుకు బ్లడ్ పాక్ట్ అనే పేరుతో ఓ క్రౌడ్‌ఫండింగ్ వేదిక ప్రారంభించబడింది. 'అహ్దే ఖౌన్'గా కూడా పిలవబడే ఈ వేదిక,ఖమేనీకి విరోధంగా ఉన్నవారిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో నిధులను సేకరిస్తోంది. ప్రత్యేకంగా ఖమేనీని అవమానపరిచే వ్యాఖ్యలు చేసే వారిని లక్ష్యంగా చేసుకోవడమే దీని లక్ష్యం.ఈ వేదిక జూలై 8నాటికి దాదాపు 27మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించింది.
వివరాలు
ఇరాన్ బెదిరింపులపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ నుంచి వచ్చిన ఈ బెదిరింపులపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. "లారిజాని వ్యాఖ్యలను ముప్పుగా భావిస్తున్నారా?" అని విలేకరులు ప్రశ్నించగా, "అవును, అది ముప్పే కావొచ్చు. నిజంగా ముప్పే అయినా అయ్యుండొచ్చు. కానీ అది నిజమో కాదో మాత్రం తెలియదు," అని పేర్కొన్నారు. "మీరు చివరిసారిగా ఎప్పుడు సన్‌బాత్‌కు వెళ్లారు?" అని అడిగిన ప్రశ్నకు నవ్వుతూ "అది నేను ఏడేళ్ల వయసులో చేసిన పని. నాకు అది అంతగా ఇష్టమైతే కాదు" అని ట్రంప్ సమాధానమిచ్చారు.
వివరాలు
దిగజారిన ఇరాన్-అమెరికా సంబంధాలు
ఇదిలా ఉండగా, ట్రంప్ తన పదవికాలంలో ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిర్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. కానీ టెహ్రాన్-ఇజ్రాయెల్ మధ్య ముదిరిన యుద్ధం నేపథ్యంలో అమెరికా కూడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు జరిపింది. దీంతో ఇరాన్-అమెరికా సంబంధాలు మరింతగా దిగజారాయి. అనంతరం ట్రంప్ కాల్పుల విరమణను ప్రకటించారు. అమెరికా మళ్లీ చర్చల కోసం ఇరాన్‌ను ఆహ్వానించినా, టెహ్రాన్ మాత్రం - స్పష్టమైన హామీ లభించకుండా చర్చలకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పింది. ఈ మధ్య ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ఘర్షణాత్మక ప్రకటనలు ప్రపంచం మొత్తానికీ ఆందోళన కలిగిస్తున్నాయి.