తదుపరి వార్తా కథనం

Trump: ట్రంప్‌నకు యూకే కోర్టు జరిమానా.. 7.4 లక్షల డాలర్లు చెల్లించాలి
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 04, 2025
08:41 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ న్యాయవ్యవస్థలో ఎదురుదెబ్బ తగిలింది. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఓ మాజీ గూఢచారిపై పరువునష్టం దావా వేయాలని ప్రయత్నించిన ట్రంప్‌కు లండన్ హైకోర్టు జరిమానా విధించింది. ఆరోపణలను నిరూపించడంలో విఫలమైన కారణంగా న్యాయ ఖర్చుల కింద ట్రంప్ $7,41,000 (డాలర్లు) చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది. యూకే గూఢచార సంస్థ ఎంఐ6 మాజీ అధికారి క్రిస్టోఫర్ స్టీల్ 2017లో ట్రంప్‌పై సంచలన పత్రాన్ని విడుదల చేశారు. ఆ పత్రంలో ట్రంప్ రష్యన్ ఏజెంట్లతో రాజీకి వచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ట్రంప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, క్రిస్టోఫర్ స్టీల్‌పై పరువునష్టం కేసు వేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రంప్ 7.4 లక్షల డాలర్లు చెల్లించాలి
Trump ordered to pay legal bill of UK firm he sued over Russia dossier https://t.co/z0pYi04FtM
— O.C. Register (@ocregister) April 3, 2025