LOADING...
Trump-Russia: రష్యాపై ఆంక్షల తొలగింపు యోచనలో అమెరికా 
రష్యాపై ఆంక్షల తొలగింపు యోచనలో అమెరికా

Trump-Russia: రష్యాపై ఆంక్షల తొలగింపు యోచనలో అమెరికా 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ప్రారంభం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), యుద్ధం ముగింపు మాత్రమే కాకుండా మాస్కోతో సంబంధాలను మరింత బలపరచాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, గతంలో అమెరికా రష్యాపై విధించిన ఆంక్షలను తొలగించే అవకాశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ప్రస్తావిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.

వివరాలు 

ముసాయిదా జాబితా రూపొందించాలని..

రష్యాకు చెందిన కొన్ని కంపెనీలు, వ్యక్తులకు ఆంక్షల నుండి ఉపశమనం కల్పించేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను రూపొందించాలని విదేశీ వ్యవహారాలు, ట్రెజరీ మంత్రిత్వ శాఖలను వైట్ హౌస్ ఆదేశించినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో అమెరికా అధికారులు, రష్యా ప్రతినిధులతో ఈ అంశంపై చర్చలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. అయితే, ఈ ఆంక్షల సడలింపుకు ప్రతిగా మాస్కో నుంచి వాషింగ్టన్ ఏమి ఆశిస్తున్నదో మాత్రం స్పష్టత లేదు.