Page Loader
USA: టిక్‌టాక్‌ నిషేధంపై ట్రంప్‌ కీలక నిర్ణయం.. అధికార బాధ్యతలు చేపట్టేవరకూ వాయిదా
టిక్‌టాక్‌ నిషేధంపై ట్రంప్‌ కీలక నిర్ణయం: అధికార బాధ్యతలు చేపట్టేవరకూ వాయిదా

USA: టిక్‌టాక్‌ నిషేధంపై ట్రంప్‌ కీలక నిర్ణయం.. అధికార బాధ్యతలు చేపట్టేవరకూ వాయిదా

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2024
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌ టాక్‌ పై అమెరికాలో నిషేధం విధించే అవకాశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ అధికార బాధ్యతలు చేపట్టే సమయానికి ఈ నిషేధం నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. జనవరి 20న ట్రంప్‌ అధికార బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఈ టిక్‌టాక్‌ నిషేధం సంబంధిత కేసు మరింత సమయం తీసుకోవాలని ట్రంప్‌ న్యాయవాదులు కోరారు. వారు ఈ విషయంలో రాజకీయ తీర్మానం తీసుకోగల అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. యూజర్ల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న ఆరోపణలతో భారత్‌ సహా పలు దేశాలు టిక్‌టాక్‌ పై నిషేధం విధించాయి.

Details

టిక్‌టాక్‌ నిషేధంపై బిల్లు

గతంలో ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ యాప్‌పై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించారు. టిక్‌టాక్‌ జాతీయ భద్రతకు ముప్పుగా ఉందని ఆయన ఆరోపించారు. అయితే న్యాయపరమైన చిక్కుల కారణంగా, అది నిషేధం రూపంలో అమలుకాలేదు. ఆ తర్వాత జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు, టిక్‌టాక్‌ నిషేధంపై బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు 352 మంది మద్దతు తెలిపారు, 65 మంది వ్యతిరేకించారు. దీంతో ఆ బిల్లు ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ పరోక్షంగా ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆయన టిక్‌టాక్‌లో చేరారు. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంటూ టిక్‌టాక్‌ నిషేధంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.