
Reciprocal tariffs: ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ 'రీసిప్రోకల్ టారిఫ్‌లు'.. అమెరికా వాణిజ్య విధానంలో కీలక మార్పులు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రీసిప్రోకల్ టారిఫ్‌లు (Reciprocal Tariffs) అనే పేరుతో కొత్త వాణిజ్య విధానాన్ని ఏప్రిల్ 2, 2025 నుంచి అమలు చేయనున్నారు.
ఈ నిర్ణయాన్ని ఆయన 'లిబరేషన్ డే' (Liberation Day)గా అభివర్ణించారు.
దీని ద్వారా అమెరికా కొన్ని దేశాలతో తన వాణిజ్య సంబంధాలను సమతుల్యం చేయాలనుకుంటోంది.
డర్టీ 15' దేశాలపై నూతన సుంకాలు
వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక నివేదిక ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం తొలుత 15 దేశాలను టార్గెట్ చేయనుంది. వీటిని 'డర్టీ 15' (Dirty 15) అనే పేరుతో గుర్తించారు. అమెరికాతో అధిక వాణిజ్య వ్యత్యాసం (ట్రేడ్ సర్‌ప్లస్) కలిగిన దేశాలపై అధిక టారిఫ్‌లు విధించనున్నారు.
Details
ప్రతి దేశానికీ వేర్వేరు రేట్లు
ఈ జాబితాలో చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, ఇండియా, మెక్సికో, కెనడా, ఇతర G20 దేశాలు ఉన్నాయి.
ఈ దేశాలపై భారీ సుంకాలు విధించే అవకాశం ఉంది.
అయితే ఇతర దేశాలపై మాత్రం కొంత తక్కువ శాతం సుంకాలు అమలు చేయనున్నారు. ప్రతి దేశానికి వేరువేరు రేట్లు నిర్ణయించనున్నారు.
మునుపటి విధానానికి భిన్నంగా నిర్ణయం
మొదట్లో అమెరికా అన్ని దేశాలపై మూడు స్థాయిల్లో (హై, మీడియం, లో) టారిఫ్‌లు విధించాలనే యోచన చేసింది.
అయితే, ఇప్పుడు ప్రతీ దేశానికి ప్రత్యేకమైన టారిఫ్ విధించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ట్రంప్ వ్యక్తిగతంగా ప్రతి దేశంతో వాణిజ్య ఒప్పందాలను సంప్రదించాలని చూస్తున్నారు.
Details
ఏప్రిల్ 2న ప్రకటన.. వెంటనే అమలు?
ఏప్రిల్ 2న ఈ టారిఫ్‌లను అధికారికంగా ప్రకటించనున్నారు. అంతే కాకుండా అత్యవసర అధికారాలను ఉపయోగించి వెంటనే అమలు చేసే అవకాశం ఉంది.
అయితే పరిశ్రమల ప్రతినిధులు ఇంకా పూర్తి స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.
విభాగాలవారీగా టారిఫ్‌లు ఉంటాయా?
ట్రంప్ టార్గెట్ చేసిన కీలక రంగాల్లో ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు ఉన్నాయి. అయితే, ఈ రంగాలపై ప్రత్యేక సుంకాల విషయంలో ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు.
ట్రంప్ మెక్సికో, కెనడాలపై కొత్త టారిఫ్‌లకు భద్రతా కారణాలను (ఫెంటనిల్ డ్రగ్ ట్రాఫికింగ్) సూచనగా చూపారు. కానీ, దీనికి సంబంధించి ఎటువంటి చట్టపరమైన వివరాలు అందుబాటులో లేవు.
Details
వ్యాపార సంస్థలకు మినహాయింపులు కల్పిస్తారా?
కంపెనీలు, విదేశీ ప్రభుత్వాలు ఈ నిర్ణయంపై గందరగోళంలో ఉన్నాయి. పరిశ్రమల ప్రతినిధులు టారిఫ్ మినహాయింపులు లభిస్తాయా లేదా అనే దానిపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడిని నేరుగా లాబీయింగ్ చేసే ప్రయత్నాలు పెరిగాయి. ఇటీవల ఓయిల్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో ట్రంప్ మినహాయింపులు ఇచ్చే అవకాశమే లేదని సంకేతాలు ఇచ్చారు.
వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్, ట్రేడ్ ప్రతినిధి జేమిసన్ గ్రీర్ కూడా మినహాయింపుల విషయంలో కఠిన వైఖరి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Details
తుది నిర్ణయం ఏప్రిల్ 2న
అంతిమంగా, ఏప్రిల్ 2న ట్రంప్ ప్రభుత్వం ఏ విధమైన టారిఫ్‌లు విధిస్తుందనే దానిపై అంతర్జాతీయ వాణిజ్య రంగం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
పరిశ్రమల ఒత్తిళ్ల మధ్య ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అనే ప్రశ్న ఇంకా అనిశ్చితంగా ఉంది.