
Donald Trump: భారత్ ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్ బాంబు.. హైదరాబాద్‌పై ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాణిజ్య విధానాలతో వార్తల్లోకి ఎక్కారు. అనేక దేశాలపై అదనపు టారిఫ్‌లను విధిస్తూ, మరింత కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ జాబితాలో భారత్‌కి ప్రత్యేక స్థానం లభించింది. ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 26 శాతం మేర అదనపు టారిఫ్‌ను విధించింది. ఇటీవల ట్రంప్, ఆటోమోటివ్ వాహనాలపై పెద్ద ఎత్తున పన్నులు విధించారు.
25 శాతం వరకు టారిఫ్ పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు గత నెల 31వ తేదీన సంతకం చేశారు.
ఈ ఆర్డర్ ఫలితంగా అమెరికాకు ఆటోమోటివ్ వాహనాలను ఎగుమతి చేస్తున్న భారత్ సహా అనేక దేశాలపై ప్రభావం చూపుతుంది. ఈ నిర్ణయం ఈ నెల 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది
Details
అమెరికా
ఇంతతోనే ఆగని ట్రంప్, ఇప్పుడు భారత్ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైనా 26 శాతం అదనపు టారిఫ్ విధించారు.
ఇప్పటికే ఉన్న పన్నులకు ఇది అదనంగా ఉండటం వల్ల మొత్తం దిగుమతుల వ్యయం మరింత పెరగనుంది. 'మేక్ అమెరికా వెల్తీ అగైన్' సిద్ధాంతం కింద ఈ నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇది కేవలం దిగుమతుల పైనే కాకుండా, అమెరికా రక్షణ శాఖకు టెక్ దిగ్గజ సంస్థలతో ఉన్న బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందాలను కూడా రద్దు చేయడానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు.
ట్రంప్ తాజాగా ఫార్మాస్యూటికల్స్ రంగంపైనా టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించారు. కంప్యూటర్ చిప్స్‌పైనా అదనపు పన్నులు విధించనున్నట్లు చెప్పారు.
Details
ఫార్మాస్యూటికల్స్ రంగాన్ని టారిఫ్ లోకి తెచ్చేందుకు కృషి
ఈ ప్రకటనలు ఆయన వైట్ హౌస్‌లో ఎల్ సాల్వెడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలెతో సమావేశమైన సందర్భంలో వెలువడ్డాయి.
టారిఫ్‌లపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ట్రంప్, వ్యతిరేకతలు వస్తున్నా, తన నిర్ణయాలు అమెరికాను ధనవంతంగా మారుస్తాయనే నమ్మకంతోనే కొనసాగిస్తున్నానన్నారు.
ఫార్మాస్యూటికల్స్ టారిఫ్ 'కమింగ్ సూన్'అని వ్యాఖ్యానించారు. అమెరికా స్వయంగా మందులను తయారు చేయని పరిస్థితిలో, ఇతర దేశాలపై ఆధారపడుతున్నదని పేర్కొన్నారు.
ముఖ్యంగా చైనా, ఐర్లాండ్‌లను ఉదాహరణగా చెప్పారు. టారిఫ్‌లు ఎంత ఎక్కువ ఉంటే, ఆయా ఉత్పత్తులు అంత త్వరగా అమెరికాలో తయారీకి మారతాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
కార్లు, స్టీల్, అల్యూమినియం లాగా ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్ రంగాన్ని కూడా టారిఫ్ పరిధిలోకి తేవాలని నిర్ణయించారని తెలిపారు.
ఈచర్యలకు తాను టైమ్‌లైన్ కూడా నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
Details
2023 నాటికి 8.73 బిలియన్ డాలర్ల విలువైన మందుల దిగుమతి
అమెరికాకు టాప్ ఫార్మా సరఫరాదారుగా భారత్ నిలుస్తోంది. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణలోని ఉత్పత్తి కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున మందులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.
హైదరాబాద్ ఫార్మాస్యూటికల్స్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఉన్నది. 2023 నాటికి భారత్ అమెరికాకు 8.73 బిలియన్ డాలర్ల విలువైన మందులు ఎగుమతి చేసింది.
ఇది దేశ మొత్తం డ్రగ్ ఎక్స్‌పోర్ట్‌లో దాదాపు 35 శాతాన్ని ఏర్పరుస్తోంది. ఇప్పటివరకు అమెరికా-భారత్ మధ్య ఫార్మా రంగానికి సంబంధించిన ఒప్పందాల్లో టారిఫ్‌లపై పలుమార్లు చర్చలు జరగటం చూశాం.
అమెరికా దిగుమతులపై భారత్ విధించే డ్యూటీలతో పోలిస్తే, భారత్ నుంచి అమెరికాకు వెళ్ళే ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్ చాలా తక్కువగా ఉందని ట్రంప్ ప్రస్తావించారు.