Donald Trump: 'దేవుడు నాతోనే ఉన్నాడు'.. ట్రంప్ ఉద్వేగ ప్రసంగం
జూలై 13న జరిగిన ఉగ్రదాడి తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఈరోజు ప్రసంగించారు. విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశంలో ట్రంప్ తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. దీని తర్వాత చెవులకు కట్టు కట్టుకుని సదస్సుకు చేరుకున్న ట్రంప్ తనపై జరిగిన దాడి గురించి చెప్పారు. ఈ సమయంలో, అయన సీక్రెట్ సర్వీస్, అతని మద్దతుదారులను ప్రశంసించాడు.
దాడిపై ట్రంప్ ఏం అన్నారంటే?
ఈసందర్భంగా తనపై జరిగిన కాల్పుల ఘటనను ట్రంప్ గుర్తు చేసుకున్నారు. "తానూ వలసదారులకు సంబంధించిన సమాచారం చూడడం కోసం చార్ట్ వైపు తిరగడంతో అదే సమయంలో బుల్లెట్ సరిగ్గా తన దగ్గరకు వచ్చిందని అదే సమయంలో తాను తల తిప్పానని చెప్పారు. ఆ సమయంలో తలా తిప్పకుండా ఉండి ఉంటే దుండగుడు కాల్చిన బుల్లెట్ లక్ష్యాన్ని చేరుకునేదని.. తాను ఇలా అందరిముందు నిలబడి ఉండేవాడిని కాదని అన్నారు. దేవుడి ఆశీస్సులే తనని కాపాడాయన్నారు. ఆ క్షణంలో స్వయంగా భగవంతుడే తన మృత్యువును అడ్డుకున్నాడంటూ ఉద్వేగంతో ప్రసంగించారు.