Trump: ఉత్తరకొరియా వద్ద 57 శక్తిమంతమైన అణ్వాయుధాలు.. కిమ్‌తో భేటీకి ట్రంప్ ఆసక్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర కొరియా వద్ద 57 శక్తిమంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్‌ను కలిసే అవకాశం ఉందని తెలిపారు. కిమ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని చెబుతూ.. ''కిమ్ వద్ద 57 శక్తిమంతమైన అణ్వాయుధాలున్నాయి. వారికి అవి దక్కి ఉండాల్సింది కాదు. నేను అధ్యక్షుడిగా ఉన్నట్లైతే.. అలా ఎప్పటికీ జరిగేది కాదు. కానీ, ఏం చేస్తాం అతడు వాటిని సంపాదించాడు. అదే సమయంలో ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను సంపాదించకుండా అడ్డుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు. ఉత్తరకొరియా విషయంలో మాత్రం ఆయన అనూహ్యంగా సానుకూల వైఖరి ప్రదర్శించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన కిమ్ జోంగ్ ఉన్ సోదరి
కిమ్‌తో తనకున్న సత్సంబంధాలను విదేశాంగ విధానంలో విజయంగా చూపించుకునేందుకే ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ట్రంప్ వైఖరిలో మార్పు ప్రభావం దక్షిణ కొరియా-అమెరికా సైనిక సహకారంపైనా పడింది.
ఇరుదేశాలు సంయుక్తంగా నిర్వహించాల్సిన యుద్ధ విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని ట్రంప్ అమెరికా రక్షణశాఖను ఆదేశించారు.
కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు ఉన్న సంబంధాలే ఈ నిర్ణయానికి కారణమని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
మరోవైపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ స్పందించారు.
తన సోదరుడితో టచ్‌లో ఉన్నానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఆమె స్పష్టం చేశారు.
వివరాలు
అమెరికాకు మిత్రదేశమైన దక్షిణ కొరియా మద్దతు ఇవ్వడానికి విముఖత
అంతేకాదు.. దక్షిణ కొరియాతో నిర్వహించే యుద్ధ విన్యాసాలను తగ్గించాలన్న ట్రంప్ నిర్ణయంపై స్పందించాల్సిన అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు.
ఇరాన్ విషయంలో అమెరికాకు మిత్రదేశమైన దక్షిణ కొరియా మద్దతు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ట్రంప్ ఉత్తరకొరియా నేత కిమ్‌ను ప్రశంసించడం ప్రారంభించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో చేపట్టే సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.
కిమ్‌తో ఉన్న వ్యక్తిగత సంబంధాలను ప్రస్తావిస్తూ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా-దక్షిణ కొరియా సంబంధాలు, ఉత్తరకొరియాపై అమెరికా విధానంపై కొత్త చర్చకు దారితీసింది.