Trump: బీబీసీకి ట్రంప్ హెచ్చరిక.. రూ.44వేల కోట్లకు దావా వేస్తా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి సమయంలో తాను చేసిన ప్రసంగాన్ని మార్చి ప్రసారం చేశారన్న కారణంతో బీబీసీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ''వచ్చే వారం లోపలే బీబీసీపై 100 కోట్ల నుంచి 500 కోట్ల డాలర్ల వరకు(దాదాపు రూ.8,870 కోట్లు నుంచి రూ.44,344 కోట్లు) దావా దాఖలు చేసే ఉద్దేశ్యం ఉంది. నేను చెప్పని మాటలను ప్రసారంలో చేర్చి పూర్తిగా తప్పుదారి పట్టించారు. అది ఎడిటింగ్‌లో జరిగిన పొరపాటన్న పేరుతో క్షమాపణలు చెప్పినా, జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వడానికి వారు ముందుకు రావడం లేదు.అందుకే కేసు వేయాలని నిర్ణయించుకున్నా.త్వరలోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో కూడా ఈ విషయంపై మాట్లాడతా''అని ట్రంప్ మీడియాతో చెప్పారు.
వివరాలు
100 కోట్ల డాలర్ల పరిహార దావా
ఇదికాక, ఇంతకుముందే కూడా బీబీసీపై కనీసం 100 కోట్ల డాలర్ల పరిహార దావా వేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే వివాదం నేపథ్యంలో, ఆ ప్రసంగంలో మార్పులు చేసినందుకు తాము కూడా విచారిస్తున్నామని బీబీసీ ఛైర్మన్ సమీర్ షా శ్వేతసౌధానికి ప్రత్యేక లేఖ ద్వారా తెలిపారు. అయితే ట్రంప్ కోరుతున్న బిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించే ఉద్దేశ్యం తమకు లేదని బీబీసీ ఒక కథనంలో స్పష్టంగా పేర్కొంది.