LOADING...
US-Iran Talks: ఇరాన్‌తో చర్చల్లో గొప్ప పురోగతి ఉంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌తో చర్చల్లో గొప్ప పురోగతి ఉంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

US-Iran Talks: ఇరాన్‌తో చర్చల్లో గొప్ప పురోగతి ఉంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2026
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే దిశగా పరిస్థితులు ముందుకు సాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రారంభించిన 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ సహా పలు దేశాల విజ్ఞప్తులు,టెహ్రాన్‌తో జరుగుతున్న దౌత్య చర్చల్లో వచ్చిన పురోగతిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఓడరేవుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో తాను చైనా పర్యటనకు వెళ్లేలోపే టెహ్రాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. హర్మూజ్‌ను తిరిగి తెరవకపోతే ఇరాన్‌పై తీవ్ర దాడులు జరగవచ్చని హెచ్చరించారు.

వివరాలు 

'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పూర్తయింది: మార్కో రూబియో

యుద్ధం ముగింపునకు ఒప్పందం కుదిరితే, అందులో భాగంగా ఇరాన్‌లోని యురేనియం నిల్వలను తామే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇరాన్‌పై దాడుల కోసం ఇజ్రాయెల్‌తో కలిసి ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పూర్తయిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఆ ఆపరేషన్ లక్ష్యాలు సాధించామని, హర్మూజ్ జలసంధిని తెరిపించే క్రమంలో ఏర్పడిన ఘర్షణలు రక్షణాత్మకమైనవేనని చెప్పారు. పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారకూడదని, శాంతి మార్గానికే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. టెహ్రాన్ ప్రభుత్వం అమెరికా డిమాండ్లకు అంగీకరించాలని సూచిస్తూ, ఈ ప్రక్రియలో చైనా పాత్ర కూడా కీలకమని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

గల్ఫ్,పశ్చిమాసియా దేశాలు తమ భవిష్యత్తును స్వయంగా నిర్ణయించుకోవాలి: చైనా 

హర్మూజ్ జలసంధిని వీలైనంత త్వరగా తిరిగి తెరవాలని చైనా ఇరాన్‌ను కోరింది. ఆ ప్రాంతంలో రవాణా కార్యకలాపాలు నిరంతరంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సమావేశమై ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. అణ్వస్త్రాల తయారీపై నియంత్రణకు ఇరాన్ కట్టుబడి ఉండటం ప్రశంసనీయమని వాంగ్ యీ అన్నారు. గల్ఫ్,పశ్చిమాసియా దేశాలు తమ భవిష్యత్తును స్వయంగా నిర్ణయించుకోవాలని చైనా అభిప్రాయపడింది. అమెరికా-ఇరాన్ మధ్య సమగ్ర కాల్పుల విరమణ ఒప్పందం అవసరమని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

వాణిజ్యసముదాయంలో అగ్నిప్రమాదం.. 8మంది మృతి 

ఇరాన్‌లో కారాగార శిక్షఅనుభవిస్తున్ననోబెల్ బహుమతి గ్రహీత నర్గిస్ మహమ్మదీ ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెను టెహ్రాన్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించకపోతే ప్రాణాపాయం ఉండొచ్చని హెచ్చరించారు. జైలులో స్పృహ కోల్పోవడంతో ఆమెను జంజన్ పట్టణంలోని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఇరాన్‌లో టెహ్రాన్ ప్రావిన్సులోని అందిషేహ్ పట్టణంలో ఒక వాణిజ్యసముదాయంలో అగ్నిప్రమాదం సంభవించి 8మంది ప్రాణాలు కోల్పోయారు.40మంది గాయపడ్డారు. మంటలు చెలరేగిన కారణాలు ఇంకా తెలియరాలేదు. దిగ్బంధనాన్ని దాటుకుని ఇరాన్ ఓడరేవు వైపు కదిలేందుకు ప్రయత్నించిన ఎం/టి హస్నా అనే ఖాళీ ట్యాంకర్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ కాల్పులు జరిపినట్లు తెలిపింది. ఇరాన్ పతాకంతో ఉన్న ఆ నౌక తమ దాడితో ఆగిపోయిందని వెల్లడించింది.

Advertisement