Page Loader
'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం 
'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం

'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం 

వ్రాసిన వారు Stalin
May 03, 2023
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా మరో మహిళ ట్రంప్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. 1970వ దశకం చివరిలో తాను ప్రయాణించిన విమానంలో డొనాల్డ్ ట్రంప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని జెస్సికా లీడ్స్(81) మంగళవారం న్యూయార్క్ కోర్టుకు తెలిపారు. ట్రంప్‌పై రచయిత జీన్ కారోల్ రేపు, పరువు నష్టం దావాలో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన జెస్సికా లీడ్స్ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. న్యూయార్క్ వెళ్లే విమానంలోని బిజినెస్ క్లాస్ సెక్షన్‌లో ట్రంప్ తన స్కర్ట్‌ను పైకి లేపారని లీడ్స్ కోర్టుకు తెలిపారు. అతను తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని, తన రొమ్ములను పట్టుకున్నట్లు ఆమె చెప్పారు.

ట్రంప్

ఇంతకీ లీడ్స్ ఏమి చెప్పిదంటే?

1970వ దశకం చివరిలో అంటే లీడ్స్ 38ఏళ్ల వయసులో ఉన్నప్పుడు విమానంలో వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ట్రంప్, లీడ్స్ తాను విమానంలో బిజినెస్ క్లాస్‌లో పక్క పక్కనే కూర్చున్నారు. ట్రంప్ తనను తాను లీడ్స్‌తో పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత లీడ్స్‌ని పెళ్లి చేసుకున్నారా? అని అడిగారు. విడాకులు తీసుకున్నట్లు లీడ్స్ చెప్పారు. ఆ తర్వాత ట్రంప్ తనను పట్టుకొని అసభ్యకరంగా ప్రవర్తించినట్లు లీడ్స్ చెప్పారు. అయితే లైంగిక వేధింపులకు సంబంధించిన అన్ని ఆరోపణలను ట్రంప్ ఖండించారు.