Loading...
Iran: ట్రంప్ హెచ్చరికల వేళ.. అమెరికా ముందు ఇరాన్ 7 కీలక షరతులు!
ట్రంప్ హెచ్చరికల వేళ.. అమెరికా ముందు ఇరాన్ 7 కీలక షరతులు!

Iran: ట్రంప్ హెచ్చరికల వేళ.. అమెరికా ముందు ఇరాన్ 7 కీలక షరతులు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ దౌత్యపరంగా కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు అణు సంబంధిత ప్రతిపాదనను పంపించింది. అయితే ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావాలంటే ముందుగా అమెరికా తమ ఏడు షరతులను అంగీకరించి, అమలు చేయాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

అమెరికా ముందు ఏడు షరతులు: మొహసెన్ రెజాయీ

రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్ ఇరాన్ అధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఇరాన్ పంపిన ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే అందులోని పూర్తి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.

మరోవైపు, ఇరాన్ భద్రతా అధికారి మొహసెన్ రెజాయీ కూడా అమెరికా ముందు ఏడు షరతులు ఉంచినట్లు వెల్లడించారు.

తమ డిమాండ్లు నెరవేరే వరకు హర్మూజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని, అమెరికాతో చర్చలు కూడా ప్రారంభించబోమని స్పష్టం చేశారు.

వివరాలు 

ఇరాన్ ప్రతిపాదించిన ఏడు షరతులు ఏమిటి?

ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఏడు షరతుల జాబితాను వెల్లడించలేదు. అయితే వివిధ మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రతిపాదనలో కొన్ని కీలక డిమాండ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటంటే.. 1.

లెబనాన్‌తో సహా ఇరాన్‌పై అన్ని రకాల శత్రుత్వ చర్యలను అమెరికా నిలిపివేయాలి.

ఇరాన్ ఓడరేవులపై విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి.

ఇరాన్‌పై విధించిన అన్ని ఆర్థిక ఆంక్షలను తొలగించాలి.

విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి.

పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికిని తగ్గించాలి.

యుద్ధం కారణంగా జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలి.

ఇరాన్ భూభాగంపై దాడులను పూర్తిగా నిలిపివేయాలి.

ADVERTISEMENT

వివరాలు 

యుద్ధం నేపథ్యంలో దౌత్య ప్రయత్నాలు ముమ్మరం

అయితే ఇరాన్ ప్రతిపాదనపై చర్చలు జరిగినా, వాటిలో అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉండాలని అమెరికా పట్టుబడుతోంది.

దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు ఏ దిశగా సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేయడంతో ప్రస్తుత ఘర్షణలు ప్రారంభమయ్యాయి.

దీనికి ప్రతిగా ఇరాన్.. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది.

దీంతో ఈ వివాదం మరింత విస్తరించింది. మరోవైపు లెబనాన్‌లోనూ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా సంస్థకు, ఇజ్రాయెల్‌కు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

యుద్ధం నేపథ్యంలో దౌత్య ప్రయత్నాలు ముమ్మరం

ఇటీవల యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిపించేందుకు మధ్యవర్తులు ప్రయత్నాలను వేగవంతం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఏడు షరతులతో పంపిన ప్రతిపాదనపై అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇరు దేశాల మధ్య చర్చలకు మార్గం సుగమం అవుతుందా? లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT