Page Loader
Elon Musk: సెక్స్‌ కుంభకోణంలో నిందితుడితోజెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్ కు సంబంధాలు.. బాంబు పేల్చిన మస్క్‌
సెక్స్‌ కుంభకోణంలో నిందితుడితోజెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్ కు సంబంధాలు.. బాంబు పేల్చిన మస్క్‌

Elon Musk: సెక్స్‌ కుంభకోణంలో నిందితుడితోజెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్ కు సంబంధాలు.. బాంబు పేల్చిన మస్క్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌ మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి. రిపబ్లికన్‌ పార్టీ ప్రతిపాదించిన పన్ను బిల్లుకు మస్క్‌ తీవ్రంగా వ్యతిరేకించడంతో,ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో, ట్రంప్‌పై మస్క్‌ సంచలనాత్మక ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. మస్క్‌ ఇటీవల ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌)లో ఓ పోస్ట్‌ పెట్టారు. అందులో, సెక్స్‌ కేసులలో ప్రధాన నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్‌ దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్‌ పేరు కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఈ విషయం ఇప్పటికే వెల్లడైనా, ఇప్పటి వరకు అధికారికంగా బహిర్గతం చేయకపోవడాన్ని మస్క్‌ ప్రశ్నించారు. ఎప్పుడో ఒకరోజు నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మస్క్ చేసిన ట్వీట్ 

వివరాలు 

ఎప్‌స్టైన్‌కు చెందిన ప్రైవేట్‌ జెట్‌లో నేను ప్రయాణించలేదు: ట్రంప్ 

జెఫ్రీ ఎప్‌స్టైన్‌ 2019లో అమెరికా జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతనికి మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌, బ్రిటిష్‌ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ, బ్లూమ్‌బెర్గ్‌ వంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కోర్టుకు సమర్పించబడిన పత్రాల్లో పేర్కొనబడినట్లు ఒక ప్రఖ్యాత వార్తాసంస్థ వెల్లడించింది. ఎప్‌స్టైన్‌ మృతి అనంతరం అతనిపై ఉన్న ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు ఫైళ్లను బహిర్గతం చేయాలని పలువురు కోరారు. దీనిపై గత ఏడాది ట్రంప్‌ స్పందిస్తూ, తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎప్‌స్టైన్‌కు చెందిన ప్రైవేట్‌ జెట్‌లో తాను ప్రయాణించలేదని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ఫైళ్లను బయటపెట్టడంలో తనకు అభ్యంతరం లేదని కూడా పేర్కొన్నారు.

వివరాలు 

బహిరంగంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మస్క్ 

ఇంకొకవైపు, రిపబ్లికన్‌ ట్యాక్స్‌ బిల్లు విషయంలో మస్క్‌ తొలిసారి బహిరంగంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీని ఫలితంగా ఆయన రిపబ్లికన్‌ పార్టీ నుంచి మరింత దూరమయ్యారు.డోజ్‌ శాఖ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన మద్దతు లేకుండా ట్రంప్‌ గెలిచే అవకాశం లేదని మస్క్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. మస్క్‌ మద్దతు లేకుండానే తాను ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమాగా చెప్పారు.

వివరాలు 

మస్క్‌కు చెందిన వ్యాపారాలకు ప్రభుత్వ సహాయాలు,కాంట్రాక్టులపై కోత

పెన్సిల్వేనియాలో మస్క్‌ సహకారం లేకుండానే గెలిచేవాడినని ఆయన అన్నారు. అంతేకాదు, మస్క్‌కు చెందిన వ్యాపారాలకు ప్రభుత్వ సహాయాలు,కాంట్రాక్టులపై కోత విధిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మస్క్‌ తమ శతవత్సరాల ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీ స్థాపనపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఓ పోల్‌ నిర్వహించారు. 'అమెరికాలో 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించగలిగే కొత్త పార్టీ ఏర్పాటుకు ఇదే సరైన సమయమా?' అని ఆయన ఆ పోల్‌లో ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటి మధ్యే మస్క్‌ ట్రంప్‌పై చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.