Trump: 'నేను చెప్పినట్టే చేయకపోతే'.. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ హెచ్చరిక..
ఈ వార్తాకథనం ఏంటి
వెనెజువెలా సుప్రీం కోర్టు డిల్సీ రోడ్రిగ్స్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆమె వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా అభివృద్ధికి తానూ సూచించిన ప్రణాళికను అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ పేర్కొన్నట్టు, తానూ సూచించిన విధంగా ప్రణాళికను అమలు చేయకపోతే, డిల్సీ రోడ్రిగ్స్‌కు భారీ పరిణామాలు ఎదురవుతాయని, నికోలస్ మదురో కంటే మరింత కఠినమైన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. '
వివరాలు
ఆ దేశ రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొం: రుబియో
అదే సమయంలో, తాను చెప్పినట్లు ప్రణాళికను అమలు చేస్తే, వెనెజువెలాకు అమెరికా సైన్యం పంపమని కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. అయితే, వెనెజువెలా చమురు రంగంపై నియంత్రణ కొనసాగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో తెలియజేశారు. అంతేకాక, అమెరికా విదేశాంగ మంత్రి రుబియో వెల్లడించినట్లుగా, వెనెజువెలా దేశాన్ని నేరుగా పరిపాలించడం, ఆ దేశ రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏ విధంగానీ జరగవని స్పష్టం చేశారు. తుది ఉద్దేశ్యం వెనెజువెలా ప్రజలకు మేలు చేకూర్చడం, ముఖ్యంగా ఆ దేశ చమురు పరిశ్రమలో సాంకేతిక,పాలన సంబంధ మార్పులను తీసుకురావడమే అని ఆయన పేర్కొన్నారు.