Donald Trump: వెనిజువెలాపై 'రెండో దాడికి' సిద్ధం: డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
వెనిజువెలాలో తాత్కాలిక నాయకత్వం వారి డిమాండ్లను తీసుకోకపోతే, ఆ దేశంపై 'రెండో దాడులకు' అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. నికోలస్ మదురొను బంధీ చేసిన తర్వాతనే వెనిజువెలాలో ప్రస్తుతం తామే అధికారంలో స్పష్టం చేశారు. అవసరమైతే మళ్లీ సైనిక చర్యలకు వెనక్కి తగ్గమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు వెనిజువెలాను ఒక 'మృత దేశం'గా వర్ణించారు. ఆ దేశం కుప్పకూలిన కారణం దశాబ్దాలపాటు కొనసాగిన దుష్పరిపాలనలే అని విమర్శించారు. వెనిజువెలాలోని విస్తారమైన చమురు నిక్షేపాలు,సహజ వనరులపై అమెరికాకు పూర్తి ఆధిపత్యం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే,ధ్వంసమైన చమురు మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి అమెరికా చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని,దీని కోసం భారీ పెట్టుబడులు అవసరమని తెలిపారు.
వివరాలు
ఈ దేశాలు ఆందోళన
మరోవైపు, మదురో బంధీ కావడాన్ని వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పద్రినో లోపెజ్ 'సామ్రాజ్యవాద దాడి'గా అభివర్ణించారు. ఆయన మదురోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ సంఘటనలపై స్పెయిన్,బ్రెజిల్,చిలీ,కొలంబియా వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వీటిని ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిణామాలుగా భావించాయి. ప్రస్తుతానికి, కరీబియన్ ప్రాంతంలో అమెరికా 15,000 మంది సైనికులను సిద్ధంగా ఉంచింది. మరోవైపు, వెనిజువెలా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడంతో, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో 30,000 మంది సైనికులను సరిహద్దుకు తరలించారు. కారకాస్‌లోని ప్రజలు తదుపరి దాడులు జరుగుతాయని భావించి, నిత్యావసర సరుకుల కోసం సూపర్‌మార్కెట్ల ముందు పెద్ద సంఖ్యలో నిలిచారు.