LOADING...
 JD Vance: భారత్‌పై సుంకాలు.. రష్యాను అడ్డుకోవడంలో అమెరికా పాత్రపై ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు
భారత్‌పై సుంకాలు.. రష్యాను అడ్డుకోవడంలో అమెరికా పాత్రపై ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు

 JD Vance: భారత్‌పై సుంకాలు.. రష్యాను అడ్డుకోవడంలో అమెరికా పాత్రపై ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2025
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌పై సుంకాల విధింపుపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయ ప్రకారం,రష్యాను అడ్డుకునేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. భారత్‌పై ఒత్తిడి పెట్టినట్టు చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ చర్యల ద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మధ్యవర్తిగా పాత్ర పోషించగలడని వాన్స్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. వాన్స్‌ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఆయన ప్రకారం,"రష్యాకు చమురు ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించడం ద్వారా,రష్యా యుద్ధాన్ని కొనసాగించలేనంత పరిస్థితిని సృష్టించడమే ఈ చర్యల లక్ష్యం.అధ్యక్షుడు ట్రంప్,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం తర్వాత కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ,అమెరికా రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మధ్యవర్తి పాత్ర పోషించగలదు," అని వాన్స్ అన్నారు.

వివరాలు 

ఉక్రెయిన్‌పై బాంబుల దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి ట్రంప్ ఆర్థిక ఒత్తిడి 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాపై బలమైన ఆర్థిక ఒత్తిడిని విధించారని కూడా వాన్స్ పేర్కొన్నారు. దీనిలో ప్రధానంగా భారత్‌పై అదనపు సుంకాలు విధించడం ద్వారా రష్యా చమురు ఆదాయాలు తగ్గిపోవడం, రష్యా దాడులను ఆపితే మాత్రమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మళ్లీ చేర్చుకోవచ్చని, కానీ దాడులు కొనసాగితే ఒంటరిగా ఉండాల్సి వస్తుందని స్పష్టమైన సందేశాన్ని ఇవ్వడం లక్ష్యమని వివరించారు. ఇలాగే, ఉక్రెయిన్‌పై బాంబుల దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి ట్రంప్ ఆర్థిక ఒత్తిడి విధానాన్ని దూకుడుగా ఉపయోగించారని, ఇందులో భారత్ ద్వితీయ సుంకాల విధింపు కూడా భాగమని వాన్స్ తెలిపారు.

వివరాలు 

భారత్‌ చమురు కొనుగోలుపై అమెరికా విమర్శలు

మరోవైపు.. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలుపై అమెరికా విమర్శలు చేసింది. ట్రంప్ భారత్ వస్తువులపై సుంకాన్ని 50 శాతం పెంచడం ద్వారా భారత్-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలు ఏర్పడాయి. అదే సమయంలో, రష్యా చమురు ఎక్కువగా కొనుగోలు చేసే చైనాపై ట్రంప్ ఎటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. దీనివల్ల, ట్రంప్ పాలనపై పలు దేశాల నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.