LOADING...
Ryo Tatsuki: జపాన్ తీరాలను తాకిన సునామీ.. 'న్యూ బాబా వంగా' భవిష్యవాణి నిజమైందా?
జపాన్ తీరాలను తాకిన సునామీ.. 'న్యూ బాబా వంగా' భవిష్యవాణి నిజమైందా?

Ryo Tatsuki: జపాన్ తీరాలను తాకిన సునామీ.. 'న్యూ బాబా వంగా' భవిష్యవాణి నిజమైందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2025
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా కమ్చట్కా ద్వీపకల్ప తీర ప్రాంతంలో సంభవించిన 8.8 తీవ్రత గల భూకంపం తర్వాత త్సునామీ తరంగాలు జపాన్‌లోని పలు తీర ప్రాంతాలను తాకాయి. జపాన్‌ వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం.. ఈ ప్రకంపనల అనంతరం 16 తీర ప్రాంతాల్లో సుమారు 40 సెంటీమీటర్ల ఎత్తైన అలలు నమోదయ్యాయి. ఈ ప్రకృతి విపత్తు జరిగిన కొద్ది రోజులకే జపాన్‌కు చెందిన ప్రముఖ మంగా కళాకారిణి, స్వయంఘోషిత జ్యోతిష్కురాలు ర్యో తాత్సుకీ (Ryo Tatsuki) చేసిన భవిష్యవాణి మళ్లీ చర్చకు వచ్చింది. ఆమె 1999లో రచించిన 'ది ఫ్యూచర్ ఐ సా' అనే మంగాలో జూలై 5, 2025న జపాన్‌కు గల తీరప్రాంతాల వద్ద సముద్రం భయకరంగా అని పేర్కొంది.

Details

జూలై 5న కాలేదేమో కానీ.. జూలైలోనే కలిశాయా?

ఈ భవిష్యవాణి చేసిన తేదీకి భూకంపం సంభవించకపోయినప్పటికీ, జూలై చివరి వారంలో జరిగిన ఈ ప్రకంపనలు ర్యో తాత్సుకీ జూలై 5 జ్యోతిష్య ఫలితానికి ముడిపడినవే కావచ్చని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. అమెరికా భూగర్భ సర్వే (USGS) మొదట ఈ భూకంప తీవ్రతను 8.7గా నమోదు చేసినప్పటికీ, తర్వాత దాన్ని 8.8గా అప్‌డేట్ చేశారు. ఇది 1952 తర్వాత ఆ ప్రాంతంలో సంభవించిన అతి పెద్ద భూకంపంగా గుర్తింపు పొందింది.

Details

 ర్యో తాత్సుకీ ఎవరు?

జపాన్‌కు చెందిన మంగా కళాకారిణి ర్యో తాత్సుకీ అనేక విపత్కర ఘటనలను ముందుగానే ఊహించినట్లు ప్రచారం ఉంది. ఆమె రచించిన 'Watashi ga Mita Mirai' (నేను చూశిన భవిష్యత్) అనే మంగాలో ప్రిన్సెస్ డయానా, ఫ్రెడీ మర్క్యూరీ మరణాలు, కరోనా మహమ్మారి, 2011 జపాన్ భూకంపం వంటి అంశాలు పేర్కొన్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా జూలైలో విపత్తు సంభవిస్తుందని ఊహిస్తూ #July5Disaster అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో అనేక మంది జపాన్‌కు చేసే ట్రిప్‌లను రద్దు చేసుకున్నారు.

Details

 జ్యోతిష్యం వల్ల భూకంపాలు సాధ్యమేనా?

సైన్సు ప్రకారం భూకంపాల జ్యోతిష్యం అసాధ్యం. భూమి అంతర్భాగంలోని ఫాల్ట్‌లైన్‌లు, టెక్టానిక్ ప్లేట్లు ఆధారంగా భూకంప ప్రమాద ప్రాంతాలను గుర్తించవచ్చు. కానీ భూకంపం సంభవించే ఖచ్చితమైన సమయం, స్థలం ముందుగానే చెప్పడం వీలుకాదు. జపాన్ వాతావరణ శాఖ ఇటీవల స్పష్టం చేసింది. తేదీలతో చెప్పే భూకంప భవిష్యవాణులు 'దురుద్దేశపూరితమైన అపోహలు మాత్రమే అని పేర్కొంది. కొన్ని భారీ భూకంపాలకు ముందు చిన్నదైన ప్రకంపనలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నా,వాటిని నమ్మదగిన సూచనలుగా పరిగణించలేమని వారు స్పష్టం చేశారు. వ్యక్తిగత ఊహలు, జ్యోతిష్యం కాకుండా భూకంపాల విషయంలో సక్రమమైన సమాచార వ్యవస్థలు, ముందస్తు హెచ్చరికలు, ప్రజల్లో అవగాహన ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మాత్రమే ప్రాణాలను కాపాడే మార్గమని స్పష్టం చేస్తున్నారు.