Page Loader
UK: యూకేలో హత్యకు గురైన భారతీయ సంతతికి చెందిన మహిళ.. భర్త కోసం పోలీసులు వేట 
యూకేలో హత్యకు గురైన భారతీయ సంతతికి చెందిన మహిళ.. భర్త కోసం పోలీసులు వేట

UK: యూకేలో హత్యకు గురైన భారతీయ సంతతికి చెందిన మహిళ.. భర్త కోసం పోలీసులు వేట 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2024
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

యూకేలో భారత సంతతికి చెందిన మహిళ హర్షితా బ్రెల్లా దారుణ హత్యకు గురైంది. తూర్పు లండన్‌లోని ఇల్‌ఫోర్డ్ ప్రాంతంలో ఓ కారులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 24 ఏళ్ల హర్షితా హత్య కేసులో ఆమె భర్త పంకజ్ లాంబ ప్రధాన అనుమానితుడిగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. హత్య అనంతరం అతను దేశం విడిచి పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాలు 

కేసు దర్యాప్తులో 60 మంది డిటెక్టివ్‌లు

ఈ కేసు దర్యాప్తులో 60 మంది డిటెక్టివ్‌లు పనిచేస్తున్నారని నార్తాంప్టన్‌షైర్ పోలీసులు తెలిపారు. "హర్షితా హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని నార్తాంప్టన్‌షైర్‌ నుంచి లండన్‌లోని ఇల్‌ఫోర్డ్ ప్రాంతానికి కారులో తరలించారని వెల్లడించారు. అనుమానితుడి కోసం గాలింపు కొనసాగుతున్నది. అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. ఆటోమెటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నిషన్ ద్వారా వాహనాల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కేసుకు సంబంధించిన సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నాం," అని పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు.

వివరాలు 

మిస్సింగ్ కేసు నమోదు

హర్షితా కనిపించడం లేదని ఆమె సన్నిహితుల నుంచి బుధవారం పోలీసులు సమాచారం అందుకున్నారు. వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురువారం, ఆమె మృతదేహం ఇల్‌ఫోర్డ్‌లోని బ్రిస్బేన్ రోడ్‌లో ఓ కారులో లభ్యమైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న పంకజ్ లాంబ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.