Page Loader
UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా.. 
'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..

UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలోని 'సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ' డైరెక్టర్‌గా పనిచేస్తున్న బ్రిటిష్-కాశ్మీరీ విద్యావేత్త ప్రొఫెసర్ నితాషా కౌల్ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (OCI) హక్కులను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయంపై స్పందించిన నితాషా కౌల్,తన ఓసీఐను రద్దు చేయడం అన్యాయమని,సరైన సమాచారం లేకుండానే తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరమని పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ—''ఇది ఒక దుర్మార్గమైన చర్య. నిజాలు, ఆధారాలు పరిశీలించకుండానే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు,'' అని పేర్కొన్నారు.

వివరాలు 

ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యతిరేకంగా ఉన్నాయని విమర్శలు

భారత ప్రభుత్వ వైఖరిపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని విమర్శించిన విద్యావేత్తలను అరెస్టులు చేయడం,దేశంలోకి రావాలని కోరుకునే విదేశాల్లో ఉన్న విద్యావేత్తలను అడ్డుకోవడం,వారి కుటుంబ సభ్యులను కలవకుండా ఆంక్షలు విధించడం తగిన విషయాలు కాదని ఆమె విమర్శించారు. అయితే,నితాషా కౌల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.భారతదేశపు సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ, భారత అధికార సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఆమె అనేక విద్వేషపూరిత ప్రసంగాలు,రచనలు చేశారు. అంతర్జాతీయ వేదికలతో పాటు సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యతిరేకంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని తక్కువచేసేలా, దేశాన్ని అపకీర్తికి గురిచేసేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆమె OCI హక్కులను రద్దు చేసినట్టు లండన్‌లోని భారత హైకమిషన్ స్పష్టంచేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నితాషా కౌల్ చేసిన ట్వీట్