
2024 US elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలల్లో తొమ్మిది మంది భారతీయులు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అధ్యక్ష స్థానంతో పాటు కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల్లో తొమ్మిది మంది భారతీయులు పోటీపడుతున్నారని సమాచారం. వీటిలో ఐదుగురు పునఃఎన్నిక కోసం ప్రయత్నిస్తున్నారు.
దలీప్ సింగ్ సంధూ 1957లో తొలిసారి కాలిఫోర్నియా 29వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు.
ఆయన అమెరికా ప్రతినిధుల సభలో అడుగుపెట్టిన తొలి ఇండో-అమెరికన్‌గా చరిత్రలో నిలిచారు. మొత్తం మూడుసార్లు ఈ స్థానంలో విజయవంతం అయ్యారు.
వివరాలు
ప్రతినిధుల సభలో స్థానం కోసం భారతీయులు
2005లో బాబీ జిందాల్ లూసియానా నుంచి గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఆ రాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు.
ప్రస్తుతం పలుచోట్ల భారతీయులు ప్రతినిధుల సభలో స్థానం కోసం పోటీపడుతున్నారు.
సుహాస్ సుబ్రహ్మణ్యం, 38 సంవత్సరాల వయస్సులో, వర్జీనియా రాష్ట్రంలో పోటీ చేస్తున్నాడు.
ఈ ఎన్నికల్లో గెలిస్తే, ఈ రాష్ట్రం నుంచి ఇండో-అమెరికన్‌గా తొలిసారి రికార్డు సృష్టించనున్నాడు.
ఆయన వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలబడ్డాడు, ఇక్కడ భారీ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు.
గతంలో, ఆయన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకి శ్వేతసౌధంలో సహాయకుడిగా పనిచేశారు.
వివరాలు
7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రమీలా జయపాల్
డాక్టర్ అమిబెరా కాలిఫోర్నియాలోని 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి మరోసారి పోటీలో ఉన్నారు.
59 ఏళ్ల అమి 2013 నుంచి ఈ స్థానంలో విజయం సాధిస్తున్నారు. ఈసారి డెమోక్రట్లు ప్రతినిధుల సభలో అధికారం సాధిస్తే, ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉంది.
ప్రమీలా జయపాల్ వాషింగ్టన్ రాష్ట్రంలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీలో ఉన్నారు.
2017 నుంచి ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. 59 ఏళ్ల ఆమె ఇప్పటికే డెమోక్రటిక్ పార్టీలో శక్తిమంతమైన నేతగా ఎదిగారు.
వివరాలు
13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి శ్రీ తానేదార్
రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీలో ఉన్నారు. 2017 నుంచి ఆయన అక్కడ విజయం సాధిస్తున్నారు.
కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రో ఖన్నా పోటీలో ఉన్నారు, ఆయన కూడా గత ఏడేళ్ల నుంచి గెలుస్తూ వస్తున్నారు.
మిషిగాన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి శ్రీ తానేదార్ కూడా బరిలో ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాలు డెమోక్రటులకు అనుకూలంగా ఉన్నాయ్.
డాక్టర్ అమిష్ షా అరిజోనా స్టేట్ అసెంబ్లీలో వరుసగా 2018, 2020, 2022లో విజయం సాధించారు, ఈసారి అతను అరిజోనా తొలి కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభ బరిలోకి దిగారు.
వివరాలు
3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రశాంత్ రెడ్డి
డాక్టర్ ప్రశాంత్ రెడ్డి కన్సాస్ 3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్నారు.
అలాగే, డాక్టర్ రాకేశ్ మోహన్ న్యూజెర్సీ 3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీలో ఉన్నారు. వీరిద్దరూ గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.