Pakistani Envoy: పాకిస్థాన్ రాయబారిని వెనక్కి పంపిన అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపులో దూకుడుగా వ్యవహరిస్తున్న అమెరికా (US), పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్‌పై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశముందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక ఘటన చోటుచేసుకుంది.
తుర్క్‌మెనిస్థాన్‌లో పాకిస్థాన్ రాయబారిగా ఉన్న ఎసాన్ వగాన్ (Ahsan Wagan)కు యూఎస్ ప్రవేశాన్ని నిరాకరించి, వెనక్కి పంపించినట్లు సమాచారం.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ విమానాశ్రయంలో, సరైన పత్రాలతో ప్రయాణిస్తున్నప్పటికీ, యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు ఎసాన్‌ను నిలిపివేసి, వీసాలో 'వివాదాస్పద ప్రస్తావనలు' ఉన్నాయని గుర్తించి ఆయనను వెనక్కి పంపినట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని లాస్ ఏంజెలెస్‌లోని పాకిస్థాన్ కాన్సులేట్‌ను ఆదేశించినట్లు తెలిపారు.
Details
మార్చి 12లోగా నివేదిక సమర్పించాలి
పూర్తి వివరాల కోసం ఎసాన్‌ను ఇస్లామాబాద్‌కు పిలిపించనున్నారు. అయితే ఈ ఘటనపై అమెరికా ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
తాజాగా అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, జాతీయ భద్రతా పరిరక్షణ చర్యల కింద పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు.
ఇందులో భాగంగా, అమెరికాలోకి ప్రవేశించే విదేశీయుల నుంచి వచ్చే భద్రతా ముప్పును ముందుగానే గుర్తించేందుకు కార్యనిర్వాహక ఆదేశం పై సంతకం చేశారు.
దీంతో, పూర్తిగా లేదా పాక్షికంగా ప్రయాణ నిషేధం విధించాల్సిన దేశాల జాబితాను మార్చి 12లోగా సమర్పించాలని కేబినెట్ సభ్యులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ ఇప్పటికే ఉండగా, పాకిస్థాన్‌ను కూడా చేర్చే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.