Loading...
Gautam Adani: గౌతమ్ అదానీకి భారీ ఊరట.. అమెరికా కోర్టులో క్రిమినల్ కేసు కొట్టివేత
గౌతమ్ అదానీకి భారీ ఊరట.. అమెరికా కోర్టులో క్రిమినల్ కేసు కొట్టివేత

Gautam Adani: గౌతమ్ అదానీకి భారీ ఊరట.. అమెరికా కోర్టులో క్రిమినల్ కేసు కొట్టివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికాలో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై అదానీ స్పందిస్తూ.. న్యాయ ప్రక్రియను గౌరవిస్తున్నానని, సత్యం, న్యాయం, చట్టబద్ధ పాలనపై తన విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'ఎక్స్‌'లో అదానీ స్పందన

వివరాలు 

ఏమిటీ కేసు?

కేసు కొట్టివేతపై గౌతమ్ అదానీ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. న్యాయ ప్రక్రియపై తనకు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు.

ఈ క్లిష్ట సమయంలో తమ గ్రూప్‌పై, న్యాయవ్యవస్థపై, భారతదేశ న్యాయ సామర్థ్యంపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

దేశ నిర్మాణం, విలువల సృష్టి కోసం తమ నిబద్ధత భవిష్యత్తులోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

భారత్‌లో సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలతో 2024లో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా పలువురిపై అమెరికాలో క్రిమినల్ కేసు నమోదైంది.

అలాగే అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారన్న అభియోగాలు కూడా వారిపై మోపారు. అదానీ, అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చాయి.

ADVERTISEMENT

వివరాలు 

ప్రాసిక్యూటర్లే కేసు ఉపసంహరణకు అభ్యర్థన

ఈ కేసును ఇకపై కొనసాగించకూడదని అమెరికా న్యాయశాఖ నిర్ణయించింది.

క్రిమినల్ అభియోగాలపై ఇకపై వనరులను వెచ్చించబోమని పేర్కొంటూ కోర్టులో కేసు కొట్టివేతకు దరఖాస్తు చేసింది.

ఈ కేసులోని ప్రధాన అంశాలు భారత్‌కు సంబంధించినవేనని, విదేశీ పరిధితో ముడిపడిన ఈ వ్యవహారాన్ని కొనసాగించడం వల్ల న్యాయ ప్రయోజనాలు నెరవేరవని ప్రాసిక్యూటర్లు వాదించారు.

ADVERTISEMENT

వివరాలు 

న్యూయార్క్ కోర్టు కీలక తీర్పు

అమెరికాలోని న్యూయార్క్ తూర్పు జిల్లా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి నికోలస్ గారౌఫిస్ ఈ వ్యవహారాన్ని పరిశీలించారు.

తొలుత కేసును కొట్టివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై మరిన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశించిన ఆయన..అనంతరం అమెరికా న్యాయశాఖ వాదనలను పరిశీలించి కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో అదానీపై ఉన్న క్రిమినల్ కేసుకు ముగింపు లభించింది.అయితే కేసు ఉపసంహరణ నిర్ణయంపై న్యాయమూర్తి కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు.

కేసును ఉపసంహరించుకోవాలన్న నిర్ణయానికి సంబంధించిన విధానం,న్యాయశాఖలోని సీనియర్ అధికారి వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్రంగా ప్రశ్నలు లేవనెత్తినట్లు రాయిటర్స్ తెలిపింది.

అయితే చివరకు కేసును కొట్టివేసేందుకు అనుమతించారు.

ఈ పరిణామంతో గౌతమ్ అదానీకి అమెరికాలో కొనసాగుతున్న ఈ క్రిమినల్ వ్యవహారంలో కీలక న్యాయపరమైన ఊరట లభించినట్లైంది.

ADVERTISEMENT