English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Gautam Adani: అదానీ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను త‌ప్పుప‌ట్టిన రిప‌బ్లిక‌న్ నేత‌
    తదుపరి వార్తా కథనం
    Gautam Adani: అదానీ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను త‌ప్పుప‌ట్టిన రిప‌బ్లిక‌న్ నేత‌
    అదానీ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను త‌ప్పుప‌ట్టిన రిప‌బ్లిక‌న్ నేత‌

    Gautam Adani: అదానీ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను త‌ప్పుప‌ట్టిన రిప‌బ్లిక‌న్ నేత‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 08, 2025
    11:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బిలియ‌నీర్ గౌతమ్ అదానీ (Gautam Adani) ఆయన కంపెనీలపై విచారణ చేపట్టాలని ఇటీవలి సమయంలో అమెరికా సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

    ముడుపులు చెల్లించిన కేసులో అమెరికా కోర్టు అదానీని నిలదీసింది. అయితే, ఈ నిర్ణయాన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపట్టారు.

    వారు, ఎంపిక చేసుకుని ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల భాగస్వామ్య దేశాలతో ఉన్న బంధాలు దెబ్బతింటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

    ఈ సందర్భంగా, అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ బీ గార్లాండ్‌కు లేఖ రాశారు లాన్స్ గూడెన్.

    వివరాలు 

    దేశంలో ఉన్న చెడు వ్యక్తుల్ని మొదటగా శిక్షించాలి

    వారు, విదేశీ వ్యక్తులను ఎంచుకుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని, అదానీపై విచారణ వెనుక ఏదైనా లోగుట్టు ఉన్నదా అని, జార్జ్ సోరస్ వంటి వ్యక్తులు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నారా అని ప్ర‌శ్నించారు.

    ఈ సందర్భంగా, అమెరికాకు బలమైన భాగస్వామిగా ఉండే భారతదేశం పై ఈ చర్యలు తీసుకోవడం వల్ల, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య సంబంధాలకు నష్టం కలగవచ్చని వారు హెచ్చరించారు.

    విదేశీ వ్యక్తులను కాకుండా, దేశంలో ఉన్న చెడు వ్యక్తుల్ని మొదటగా శిక్షించాలి, అని గూడెన్ చెప్పారు.

    అదానీ సంస్థ అమెరికన్ పెట్టుబడులు, ల‌క్ష‌లాది ఉద్యోగాలను కల్పిస్తున్నందున, ఈ విచారణ వల్ల దీర్ఘకాలిక నష్టాలు అమెరికాకే కలగవచ్చని ఆయన పేర్కొన్నారు.

    మీరు
    33%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    విదేశీ వ్యక్తులను టార్గెట్ చేయడంలో న్యాయ శాఖకు ఉత్సాహం ఎందుకు

    అయితే, గూడెన్, ఒకవేళ అదానీపై ఆరోపణలు నిజమైతే, వాటిని నిరూపించినా, ఈ అంశంలో అమెరికా పాత్ర ఏంటి అని ప్రశ్నించారు.

    అదానీ సంస్థ భారతదేశంలో అధికారులకు లంచాలు ఇచ్చిందని, అక్కడి ఒక కంపెనీ ఈ లావాదేవీల్లో పాల్పడిందని, కానీ ఇందులో అమెరికా వ్యక్తుల ప్ర‌తిపాద‌న ఏంటని గూడెన్ అడిగారు.

    అమెరికా వ్యక్తుల ప్ర‌మేయం లేకుండా, విదేశీ వ్యక్తులను టార్గెట్ చేయడంలో న్యాయ శాఖకు ఉత్సాహం ఎందుకు వుందని ప్రశ్నించారు.

    అదానీ ముడుపుల కేసులో ఏ ఒక్క అమెరికా వ్యక్తి లేకపోవడం ఎందుకు అని కూడా గూడెన్ ప్ర‌శ్నించారు.

    మీరు
    66%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    భారతీయ అధికారులను అమెరికాకు రప్పిస్తారా

    ఇండియాలో అవినీతి జరిగితే, అదానీపై అమెరికాలో కేసు నమోదు చేయడం ఏంటి అని న్యాయ శాఖను నిలదీశారు.

    మీరు భారతదేశంలో న్యాయం కోసం వత్తిడి తెస్తున్నారా అని అడిగారు. ఈ కేసులో నిమగ్నమైన భారతీయ అధికారులను అమెరికాకు రప్పిస్తారా అని ప్రశ్నించారు.

    ఒకవేళ అవినీతి అధికారులను అప్పగించేందుకు భారతదేశం నిరాకరించినా, అమెరికా న్యాయ శాఖ వద్ద ఏమైనా ఆప్షన్లు ఉన్నాయా అని గూడెన్ అడిగారు.

    చివరికి, అమెరికా, భారత్ మధ్య విభేదాలు పెంచి, బైడెన్ ప్రభుత్వం ఈ కేసును అంతర్జాతీయంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నదా అని రిపబ్లికన్ నేత గూడెన్ ప్రశ్నించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం.. ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: భారత్‌పై పాక్ డ్రోన్ల దాడి.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు  భారతదేశం
    Srinagar Airport: శ్రీనగర్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా డ్రోన్ దాడికి యత్నం.. అడ్డుకున్న భారత సైన్యం శ్రీనగర్

    అమెరికా

    USA: ఐకాన్ పార్క్‌లో ప్రమాదం.. మృతుడి కుటుంబానికి 2,600 కోట్లు పరిహారం అందజేయాలని తీర్పు  న్యాయస్థానం
    Melania Trump: ట్రంప్‌ విజయంలో బారన్‌ మాస్టర్‌ స్ట్రాటజీ.. మెలానియా కామెంట్స్ డొనాల్డ్ ట్రంప్
    US-Syria: అల్-అస్సాద్ పతనం.. సిరియాలో అమెరికా వైమానిక దాడులు..వెల్లడించిన బైడెన్‌  జో బైడెన్
    US Student Visa: US F-1 వీసాలలో తగ్గిన భారతీయ విద్యార్థులు వీసాలు వీసాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025