Gautam Adani: అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన కేసుల ఉపసంహరణ?
ఈ వార్తాకథనం ఏంటి
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులను ఉపసంహరించుకునే దిశగా అక్కడి న్యాయశాఖ చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ అంశంపై ఈ వారాంతంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని బ్లూమ్‌బర్గ్, 'ద న్యూయార్క్ టైమ్స్' వంటి పత్రికలు పేర్కొన్నాయి. అదేవిధంగా, 2024 నవంబరులో అమెరికా సెక్యూరిటీల నియంత్రణ సంస్థ వద్ద నమోదైన కేసును కూడా మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ సంస్థల తరఫు న్యాయవాది ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని 'ద న్యూయార్క్ టైమ్స్' తన సామాజిక మాధ్యమ వేదికలో వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గౌతమ్ అదానీపై కేసుల ఉపసంహరణకు రంగం సిద్ధం
US authorities are moving to resolve the fraud charges against Indian billionaire Gautam Adani, sources say, and end a criminal case that’s hung over Asia’s richest person for more than a year https://t.co/erS6TWzwUU
— Bloomberg (@business) May 14, 2026