LOADING...
USA: అలస్కా మీదుగా ప్రయాణిస్తుండగా అదృశ్యమైన అమెరికా విమానం 
అలస్కా మీదుగా ప్రయాణిస్తుండగా అదృశ్యమైన అమెరికా విమానం

USA: అలస్కా మీదుగా ప్రయాణిస్తుండగా అదృశ్యమైన అమెరికా విమానం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2025
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో అలాస్కా పైగా ప్రయాణిస్తున్న ఓ విమానం అదృశ్యమైంది. ఈ విమానంలో దాదాపు 10 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ఈ విషయాన్ని అలాస్కా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అదృశ్యమైన ఈ విమానం బేరింగ్ ఎయిర్ సంస్థకు చెందిన సెస్నా 208బీ గ్రాండ్ కారవాన్ మోడల్‌గా గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటలకు ఉనల్కలేట్ నుంచి నోమ్ వెళ్లే దారిలో ఈ విమానం అదృశ్యమైంది. సాయంత్రం 2:37కి ప్రయాణం ప్రారంభమైన ఈ విమానం, 3:16కు రాడార్ నుంచి మాయమైంది. ఇది నార్టన్ సౌండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

వివరాలు 

సైనిక హెలికాప్టర్‌ ను ఢీకొన్న విమానం 

ఇంతకు ముందుగా, దాదాపు వారం క్రితం ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రమాదానికి గురైన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. ఈ విమానం మెడికల్ ట్రాన్స్‌పోర్టర్గా గుర్తించారు. ప్రమాద సమయానికి, ఇందులో నలుగురు సిబ్బంది, ఓ చిన్నారి, ఆమె తల్లి ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఇక అంతకుముందు, వాషింగ్టన్ డీసీ సమీపంలోని రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం వద్ద ఓ ప్రయాణికుల విమానం ల్యాండ్ అవుతుండగా సైనిక హెలికాప్టర్‌ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఇందులోని 64 మంది ప్రయాణికులు, హెలికాప్టర్‌లోని నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.