Doug Collins: అమెరికా వెటరన్స్ వ్యవహారాల కార్యదర్శిగా మాజీ జార్జియా ప్రతినిధి డౌగ్ కాలిన్స్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన జట్టును ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో,మాజీ జార్జియా కాంగ్రెస్ సభ్యుడు డగ్ కాలిన్స్‌ను తన మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. సమాచారం ప్రకారం,డగ్ కాలిన్స్‌ను అమెరికా వెటరన్‌స్ అఫైర్స్ (VA) కార్యదర్శిగా నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. గురువారం ఒక ప్రకటనలో,ట్రంప్ కాలిన్స్‌లో చురుకైన సైనిక సిబ్బంది, అనుభవజ్ఞులు, సైనిక కుటుంబాల హక్కుల కోసం న్యాయంగా వాదించే సామర్థ్యాన్ని గుర్తించి, అతనిపై విశ్వాసం వ్యక్తం చేశారు. "డౌగ్ కాలిన్స్ మా యాక్టివ్ డ్యూటీ సర్వీస్‌మెంబర్లు,అనుభవజ్ఞులు,సైనిక కుటుంబాలకు అవసరమైన మద్దతును కల్పించేందుకు గొప్ప న్యాయవాదిగా ఉంటారు" అని ట్రంప్ తెలిపారు. ఈ కీలకమైన పాత్రలో దేశానికి సేవ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
అమెరికా సెక్రటరీ ఆఫ్ వెటరన్‌స్ అఫైర్స్‌గా నామినేట్
కాలిన్స్, ఒక సైనిక అనుభవజ్ఞుడు, ప్రస్తుతం అమెరికా ఎయిర్ ఫోర్స్ రిజర్వ్ కమాండ్‌లో చాప్లిన్‌గా పని చేస్తున్నారు. ఇరాక్ యుద్ధంలో అమెరికా తరపున పోరాడిన ఆయన, ఇప్పుడు అమెరికా సెక్రటరీ ఆఫ్ వెటరన్‌స్ అఫైర్స్‌గా నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా కాలిన్స్, ట్రంప్ తన నామినేషన్‌ను అంగీకరించడం గర్వంగా ఉందని, "నిబంధనలను క్రమబద్ధీకరించడానికి, అవినీతిని నిర్మూలించడానికి, వెటరన్స్ కోసం మరిన్ని మేలు సాధించడానికి తాము సమర్థంగా పనిచేస్తాం" అని తెలిపారు. ప్రతి అనుభవజ్ఞుడు తన పోరాటంలో సంపాదించిన ప్రయోజనాలను పొందుతాడని ఆయన అన్నారు.