NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Perks for US president: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కి సకల సదుపాయాలు.. వేతనం, ఇతర సౌకర్యాలు ఇలా..
    తదుపరి వార్తా కథనం
    Perks for US president: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కి సకల సదుపాయాలు.. వేతనం, ఇతర సౌకర్యాలు ఇలా..
    అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కి సకల సదుపాయాలు.. వేతనం, ఇతర సౌకర్యాలు ఇలా..

    Perks for US president: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కి సకల సదుపాయాలు.. వేతనం, ఇతర సౌకర్యాలు ఇలా..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 06, 2024
    09:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అగ్రరాజ్యం అయిన అమెరికాకు తదుపరి అధ్యక్షుడు ఎవరో అన్న ప్రశ్నపై ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూసాయి.

    ఏ దేశాధ్యక్ష ఎన్నికకూ ఇంతటి ఆసక్తి ఉండదూ అంటే అతిశయోక్తి కాదు. అలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి అందించే సదుపాయాలు కూడా అత్యున్నత స్థాయిలో ఉంటాయి.

    శ్వేత సౌధంలో ఉండే భద్రతా సిబ్బంది, అధిక వేతనం, 24/7 భద్రత తదితర అంశాలు అందరికీ తెలిసినవి.

    మరి, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు ఏమేమి సదుపాయాలు అందబోతున్నాయో చూద్దాం.

    వివరాలు 

    అమెరికా అధ్యక్షుడికి వార్షికంగా 4 లక్షల డాలర్ల వేతనం

    అమెరికా అధ్యక్షుడు వార్షికంగా 4 లక్షల డాలర్ల వేతనం అందుకుంటారు.భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ. 3.3 కోట్లకు సమానం.

    ఈ మొత్తం 2001లో అమెరికా కాంగ్రెస్ నిర్ణయించింది. అప్పటి నుండి వేతనంలో ఎటువంటి మార్పులు లేవు. సింగపూర్‌ ప్రధాని అందుకునే 16 లక్షల డాలర్లలో ఇది నాలుగో వంతు మాత్రమే!

    అమెరికా అధ్యక్షుడిగా రిటైరయ్యాక వార్షికంగా 2 లక్షల డాలర్లు లభిస్తాయి. అదనంగా 1 లక్ష డాలర్లు అలవెన్సు రూపంలో అందుతాయి.

    వివరాలు 

    అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం శ్వేత సౌధం

    అమెరికా అధ్యక్షుడికి వేతనంతో పాటు వ్యక్తిగత, అధికారిక ఖర్చుల కోసం ఏటా పన్ను రహితంగా 50 వేల డాలర్లు అందుతాయి.

    ప్రయాణ ఖర్చుల కోసం మరో లక్ష డాలర్లు, వినోదం కోసం మరో 19 వేల డాలర్లు అందుతాయి.

    ఈ మొత్తాన్ని మొత్తం కలిపితే, అమెరికా అధ్యక్షుడికి ప్రతి సంవత్సరం సుమారు 5.69 లక్షల డాలర్లు లభిస్తాయి.

    అధ్యక్షుడిగా శ్వేత సౌధంలో అడుగు పెట్టడానికి ముందు అందించే డెకరేట్ (సోషల్, ఆడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు)కు మరో లక్ష డాలర్లు ఖర్చవుతాయి.

    అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం శ్వేత సౌధం. ఇది 6 అంతస్తుల భవనంగా 1800లో నిర్మించబడింది.

    వివరాలు 

    శ్వేత సౌధం కాకుండా, బ్లెయిర్ హౌస్ అనే అతిథి గృహం

    కాలక్రమేణా అనేక మార్పులు, హంగులు జోడించబడ్డాయి. 55,000 చదరపు అడుగుల కలిగిన ఈ భవనంలో 132 గదులు, 35 బాత్‌రూములు ఉన్నాయి.

    ఇందులో టెన్నిస్ కోర్టు, జాగింగ్ ట్రాక్, సినిమా థియేటర్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉంటాయి. అధ్యక్షుడికి విందు ఇవ్వడానికి ఐదు చెఫ్‌లు ప్రతిరోజూ పనిచేస్తుంటారు.

    శ్వేత సౌధం కాకుండా, బ్లెయిర్ హౌస్ అనే అతిథి గృహం కూడా ఉంటుంది.

    ఇది 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 119 గదులు, 20 బెడ్‌రూములు,35 బాత్‌రూములు, 4 డైనింగ్ హాల్స్, జిమ్, సెలూన్ వంటివి కలిగిన భవనంగా ఉంటుంది.

    అలాగే, క్యాంప్ డేవిడ్ అనే పర్వత విడిది కేంద్రం కూడా అందుబాటులో ఉంటుంది. ఇది మేరీల్యాండ్ రాష్ట్రంలో 128 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

    వివరాలు 

    అధ్యక్షుడి ప్రయాణం కోసం'బీస్ట్'

    ప్రతి అధ్యక్షుడు దీనిని వినియోగిస్తున్నారు. ఇక్కడే ఇజ్రాయెల్, ఈజిప్టుల మధ్య ఒప్పందం కూడా జరిగింది.

    అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం 'ఎయిర్‌ఫోర్స్‌ వన్' చాలా సౌకర్యాలతో ఉంటుంది. దీనికి గాల్లోనే ఇంధనాన్నినింపే సామర్థ్యం ఉంది.

    దాన్ని"ఎగిరే శ్వేత సౌధం"అని కూడా అంటారు.అధికారిక హెలికాప్టర్ 'మెరైన్‌ వన్' గంటకు 241 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

    ఇది ప్రముఖ 5 హెలికాప్టర్ల జాబితాలో ఒకటి, అన్నిటికీ భద్రతా వ్యవస్థలు ఉంటాయి.

    అమెరికా అధ్యక్షుడి ప్రయాణం కోసం'బీస్ట్'అనే కారును ఉపయోగిస్తారు.

    దీనిని అత్యున్నత భద్రతా ప్రమాణాలతో తయారుచేశారు.ప్రతి దేశంలో,అధ్యక్షుడితో పాటు కుటుంబ సభ్యుల భద్రత కోసం 24/7 సీక్రెట్ సర్వీస్‌ భద్రత ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    డొనాల్డ్ ట్రంప్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అమెరికా

    CIA: ఉత్తర కొరియా,ఇరాన్, చైనాలో ఇన్‌ఫార్మర్ల కోసం ప్రకటన జారీ చేసిన సీఐఏ అంతర్జాతీయం
    America: బంగ్లాదేశ్ హిందువులపై హింసను ఆపండి.. న్యూయార్క్ ఆకాశంలో ఎగురుతున్న బ్యానర్  బంగ్లాదేశ్
    T10 Tournament: యూఎస్‌ఏలో టీ10 లీగ్.. క్రికెట్‌కు విభిన్న ఫార్మాట్లు కొత్త వెలుగులు టీమిండియా
    Bathukamma festival :అమెరికా షార్లెట్ నగరంలో బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపు  బతుకమ్మ పండగ

    డొనాల్డ్ ట్రంప్

    Trump-Elon Musk: మస్క్ ఇంటర్వ్యూలో కమలా హారిస్‌ను టార్గెట్ చేసిన ట్రంప్   ఎలాన్ మస్క్
    Donald Trump: 'కమలా హారిస్ కంటే నేనే బాగుంటా'.. వ్యక్తిగత విమర్శలు చేసిన ట్రంప్ కమలా హారిస్‌
    Donald Trump: నా క్యాబినెట్‌లో ఎలాన్‌ మస్క్‌కు చోటు: ట్రంప్‌ ఎలాన్ మస్క్
    Donald Trump: నన్ను గెలిపిస్తే.. ఉచిత IVF చికిత్స: డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025