Page Loader
హర్యానా మత ఘర్షణలపై స్పందించిన అమెరికా.. హింసకు దూరంగా ఉండాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి 
హింసకు దూరంగా ఉండాలని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి

హర్యానా మత ఘర్షణలపై స్పందించిన అమెరికా.. హింసకు దూరంగా ఉండాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 03, 2023
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలో చెలరేగిన తీవ్ర మత ఘర్షణలపై అగ్రరాజ్యం అమెరికా స్పందంచింది. నూహ్ జిల్లాలో మొదలైన హింస, గురుగ్రామ్ వరకు వ్యాపించింది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యు మిల్లర్ హింసాత్మక ఘటనల జోలికి వెళ్లకుండా ఉండాలని, అదే తాము నిరంతరం కోరుకుంటామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచిస్తున్నట్లు చెప్పారు. ఘర్షణలతో అమెరికన్లు ఏ మేర ఇబ్బందులు ఎదుర్కొన్నారో తమకు ఇంకా స్పష్టత రాలేదన్నారు. మరోవైపు హింస కట్టడికి హర్యానా ప్రభుత్వం నడుం బిగించింది.నూహ్ జిల్లా సహా ఫరిదాబాద్, పల్వాల్, గురుగ్రామ్‌లోని మూడు సబ్‌ డివిజన్లలో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగిస్తోంది. ఆగస్ట్ 5 వరకు ఈ నిషేధం ఉంటుందని ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 హింసకు దూరంగా ఉండాలని అమెరికా విజ్ఞప్తి