G-20 SUMMIT- 2023: నాల్గోసారి భారత్ రానున్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్
అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ భారత్ రానున్నారు. దిల్లీ వేదికగా త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన జీ-20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మేరకు ఆర్థిక వ్యవస్థ, వాతావరణం,ఉక్రెయిన్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇదే ఏడాదిలో ఇప్పటికే 3 సార్లు ఇండియాకు వచ్చిన జానెట్ యెల్లెన్, తాజాగా నాలుగోసారి రానుండటం విశేషం. గ్లోబల్ ఎకానమీ,రుణ స్థిరీకరణ, అంతర్జాతీయ ద్రవ్య నిధి ట్రస్ట్ ఫండ్ వనరులను నిర్మించడంతోపాటు భారత్‌తో సంబంధాల బలోపేతానికి యెల్లెన్ ఫోకస్ పెట్టారు. ఉక్రెయిన్‌కు ఆర్థికంగా సహకరిస్తూ, రష్యాపై ఆంక్షలు విధిస్తూ,యెల్లెన్ G-20 మిత్రదేశాలను కూడగట్టనున్నారు. అమెరికా పెట్టుబడులు, గొలుసు కట్టు సరఫరా కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌తో ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతానికి ఆమె కృషి చేస్తారని ట్రేజరీ తెలిపింది.